Nirmala Sitharaman: నేను మధ్యతరగతే, వారి కష్టాలు తెలుసు.. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా
మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై తాజాగా ఎలాంటి పన్నులు విధించలేదని నిర్మలా గుర్తు చేశారు. అలాగే, 5 లక్షల రూపాయల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉందని ఆమె ప్రకటించారు. 27 నగరాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, జీవన సౌలభ్యాన్ని పెంపొందించేందుకు 100 స్మార్ట్ సిటీలను నిర్మించడం వంటి పలు చర్యలు ప్రభుత్వం చేపట్టిందని ఆమె తెలిపారు.

Nirmala Sitharaman: రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పన్నుల బాదుడుపై దేశ ప్రజల నుంచి వెలువెత్తున్న ఆందోళనల పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పౌరులపై ఎటువంటి తాజా పన్నులు విధించలేదని స్పష్టనిచ్చారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆదివారం నిర్మలా మాట్లాడుతూ.. మధ్యతరగతి ఒత్తిళ్ల గురించి తనకు తెలుసని, కారణం తాను కూడా అదే మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తినేనని పేర్కొన్నారు.
Kerala :కేరళ సీఎం రేసులో శశి థరూర్ అంటూ ప్రచారం.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన థరూర్
ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతుందని, ఇతరులతో పాటు మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తుందని అంచనాల మధ్య 2023-24 కోసం ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య పత్రిక నిర్వహించిన ఆమె మాట్లాడుతూ “నేను కూడా మధ్యతరగతికి చెందిన వ్యక్తినే. కాబట్టి మధ్యతరగతి ఒత్తిళ్లను నేను అర్థం చేసుకోగలను. మధ్యతరగతి వర్గంగా నన్ను నేను చూసుకుంటాను. కాబట్టి వారి కష్టాలు నాకు తెలుసు” అని అన్నారు.