షర్ట్ కింద లుంగీ కట్టుకుంటా: ఆనంద్ మహీంద్రా

షర్ట్ కింద లుంగీ కట్టుకుంటా: ఆనంద్ మహీంద్రా

Work from home అని చెప్తుంటారు కానీ, ఇంట్లో ఉంటే ఎలా పనిచేస్తారో సోషల్ మీడియాల్లో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్ చేయడం విశేషం. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ ఇది ఎక్స్‌పెక్టేషన్.. ఇది రియాలిటీ అని పోస్టు పెట్టారు. 

‘దాంతో పాటు ఇది నాకు వాట్సప్ లో వచ్చింది. నేను కూడా ఇలానే చేస్తుంటా. ఇంట్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ వస్తే షర్ట్ కిందనే లుంగీ కట్టుకుంటా. అలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేచి నిల్చోను. ఈ ట్వీట్ చదివిన తర్వాత నా కొలీగ్స్ నన్ను నిల్చోమని అడుగుతారేమో’ అని ట్వీట్ చేశారు. 

 

ఈ ఫన్నీ ట్వీట్ కు షేర్ చేసిన కాసేపటికే 19వేల లైకులు దక్కించుకుంది. దానికి ఆశ్చర్యం తట్టుకోలేక ఒక యూజర్ సర్ మీరు ఇంట్లో లుంగీ కట్టుకుంటారా అని అడిగితే.. దానికి ఎప్పుడూ.. ఊటీలో ఉన్నప్పుడు నా స్కూల్ రోజుల నుంచి కట్టుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. 

కరోనాపై పోరాడేందుకు మహీంద్రా గ్రూప్ చాలా రకాలుగా సాయం చేస్తుంది. ఆర్థికంగా సాయం చేయడంతో పాటు పేదలకు ఆహారాన్ని అందజేస్తుంది. 10లొకేషన్లలో కిచెన్లు ఏర్పాటు చేసి వండిపెడుతుంది. దీనిపైనా ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా ‘మీరు కేవలం కిచెన్లు మాత్రమే ఓపెన్ చేయలేదు. మీ ధైర్యమైన గుండెలు తెరిచారు. గుండెలోతుల్లోంచి మీకు థ్యాంక్స్ చెబుతున్నా’ అని ట్వీట్ చేశారు. 

 

 

ఇవే కాకుండా మాస్కులు, వెంటిలేటర్లు తయారుచేసే పనిలో పడింది మహీంద్రా గ్రూపు. తాత్కాలికంగా మహీంద్రా హాలిడే రిసార్ట్స్ అన్నింటినీ టెంపరరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గా మార్చేశారు. 

Also Read | ముందు ప్రజలను బతికించుకొందం…ఆ తర్వాత ఆర్ధికవ్యవస్థ గురించి ఆలోచిద్దాం… రెండు వారాల లాక్ డౌన్ తప్పదు…