Cow Urine – Covid: రోజూ గోమూత్రం తాగుతా.. నాకు కరోనా రాదు – బీజేపీ ఎంపీ

గోమూత్రం తాగితే కొవిడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చెప్తున్నారు. దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుందని అన్నారు. తాను ప్రతి రోజూ...

Cow Urine – Covid: రోజూ గోమూత్రం తాగుతా.. నాకు కరోనా రాదు – బీజేపీ ఎంపీ

Cow Urine

Cow Urine – Covid: గోమూత్రం తాగితే కొవిడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చెప్తున్నారు. దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుందని అన్నారు. తాను ప్రతి రోజూ గోమూత్రం తాగుతున్నానని అది తనను కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని అన్నారు.

మీ దగ్గర దేశీ ఆవు ఉంటే దాని మూత్రాన్ని రోజూ సేవించండి. అది కొవిడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ రోజూ గోమూత్రం తీసుకుంటున్నా. అందుకే ఇప్పుడు నేనెటువంటీ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కరోనా లేదు’ అని ప్రగ్యా ఠాకూర్ పార్టీ సమావేశంలో చెప్పారు.

గో మూత్రం ప్రాణాలు కాపాడుతుంది. అని చెప్పిన ప్రగ్యా ఠాకూర్ రెండేళ్ల క్రితం గో మూత్రంతో పాటు ఇతర ఆవు ఉత్పత్తులు తీసుకుని క్యాన్సర్ ను జయించానని చెప్పారు. ఆమెలో కొవిడ్ లక్షణాలు కనిపించడంతో డిసెంబర్ 2020లో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు.

కొవిడ్ విషయంలో నిర్ధారితం కానీ మెడిసిన్ ను ప్రజలు ఉపయోగించవద్దంటూ డాక్టర్లు రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం గోమూత్రం తాగితే కొవిడ్ నుంచి కాపాడుకోవచ్చనే ఎటువంటి సైన్స్ పరమైన సాక్ష్యాల్లేవని చెప్పింది.