Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా

‘గవర్నర్ కు నేను రాజీనామా లేఖను అందించాను. అయితే, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాను. పలు అంశాలపై విశ్లేషించుకోవాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల దిశ మారడానికి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వారిని కాపాడుకోవడం కాంగ్రెస్ విధి. మెజారిటీని కాపాడుకోవడం కూడా వారి పని’’ అని జైరాం ఠాకూర్ చెప్పారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కు రాజీనామా లేఖను అందించినట్లు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘గవర్నర్ కు నేను రాజీనామా లేఖను అందించాను. అయితే, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాను. పలు అంశాలపై విశ్లేషించుకోవాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల దిశ మారడానికి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి. మా పార్టీ అధిష్టానం పిలిస్తే నేను ఢిల్లీకి వెళ్లి చర్చిస్తాను’’ అని జైరాం ఠాకూర్ చెప్పారు.

తమ ఓటమిని అంగీకరిస్తున్నామని జైరాం ఠాకూర్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు జరిపే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలపై జైరాం ఠాకూర్ సెటైర్లు వేశారు. ‘‘కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వారిని కాపాడుకోవడం కాంగ్రెస్ విధి. మెజారిటీని కాపాడుకోవడం కూడా వారి పని’’ అని అన్నారు.

ఈ సారి ఓట్ల శాతం అధికంగా నమోదైనందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మద్దతు తెలిపినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా ధన్యవాదాలని చెప్పారు. ప్రతి రంగంలోనూ అభివృద్ధి కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు