CM Nitish Kumar: ప్రధాని పదవిపై మనసులో మాట బయటపెట్టిన నితీష్ కుమార్.. ఇన్నాళ్లకు క్లారిటీ

ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమార్ స్పందించారు.

CM Nitish Kumar: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు.

Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాజాగా దీనిపై నితీష్ కుమార్ స్పందించారు. తనకు ప్రధాని కావాలన్న కోరిక లేదని స్పష్టం చేశారు. బిహార్‌లో బీజేపీ మినహా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పక్షాలన్నీ కలిసి ‘మహాఘాత్‌బంధన్ (ఎంజీబీ)’గా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభకు జరగబోయే ఎన్నికల్లో ఎంజీబీ తరఫున నితీష్ కుమారే ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు దీనికి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై తాజాగా మీడియా నితీష్ కుమార్‌ను ప్రశ్నించింది.

మీరు ప్రధాని అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నిలబడతారా అని మీడియా అడిగింది. దీనికి నితీష్ సమాధానమిచ్చారు. ‘‘నేను మళ్లీ చెబుతున్నా. ప్రధాని కావాలన్న ఆశ నాకు లేదు. దీనిపై ప్రకటనలు చేయకండి’’ అని నితీష్ అన్నారు. దీంతో ఆయన ప్రధాని పదవి రేసులో లేరని స్పష్టత వచ్చినట్లైంది. నితీష్ పేరు ఈ అంశంలో అనేకసార్లు తెరమీదకి వచ్చింది. మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాల తరఫున ఆయన పేరు వినిపిస్తూ ఉండేది.

 

ట్రెండింగ్ వార్తలు