IT Refund : 24లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రీఫండ్.. ఆన్‌లైన్‌లో స్టేటస్ ఇలా తెలుసుకోండి

23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు(ఆదాయపు పన్ను రిటర్న్-ఐటీఆర్ దాఖలు చేసిన) రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 8న

IT Refund : 24లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రీఫండ్.. ఆన్‌లైన్‌లో స్టేటస్ ఇలా తెలుసుకోండి

It Refund

IT Refund : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 30 మధ్య 23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు(ఆదాయపు పన్ను రిటర్న్-ఐటీఆర్ దాఖలు చేసిన) రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 8న ఐటీఆర్ దాఖలు చేసిన 22,61,918 మందికి రూ.16,373 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లు, అలాగే, 1,37,327 కేసుల్లో రూ.51,029 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్ చేసినట్లు తెలిపింది.

Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…

ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల మధ్య ఐటీఆర్ రీఫండ్ చేసింది. అయితే, ఈ సమస్య కారణంగా చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇంకా తమ ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయలేదు. సాధారణంగా, ఐటీఆర్ రీఫండ్ దాఖలు చేసిన 10 రోజుల్లోగా జారీ చేస్తారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా ఆలస్యం కావొచ్చు. ఒకవేళ మీరింకా మీ రీఫండ్ అందుకోనట్లయితే, ఐటీ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ‘incometaxindia.gov.in’ లో చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఇలా చెక్ చేయాలి:
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్ డీఎల్) వెబ్ సైట్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్ సైట్ లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ డిఎల్ వెబ్ సైట్ లో పాన్, అసెస్ మెంట్ ఇయర్(ఎవై) వివరాలు నమోదు చేసి ‘ప్రొసీడ్’ మీద క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ మీకు డిస్ ప్లే మీద చూపిస్తుంది.

Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..

* ముందుగా ఐ-టీ డిపార్ట్ మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ కావాలి.
* రిటర్న్స్/ఫారమ్స్ ఎంచుకోండి.
* ఆ తర్వాత ‘మై అకౌంట్’ ట్యాబ్ కు వెళ్లి ‘ఐ-టీ రిటర్న్స్’ ఎంచుకోండి.
* సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
* అక్నాలెడ్జ్ మెంట్ నెంబర్ పై క్లిక్ చేయండి.
* ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ తో పాటు రిటర్న్ వివరాలు పేజీ మీద కనిపిస్తాయి.

పన్ను చెల్లింపుదారులు రీఫండ్ డబ్బు నేరుగా వారి ఖాతాకు క్రెడిట్ చేస్తారు. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చిరునామాకు పంపిస్తారు. అందువల్ల, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకి సంబంధించిన వివరాలు సరిగ్గా నింపబడ్డాయని వారు ధృవీకరించుకోవాలి.