PM Modi: అలాంటి రాజకీయాలు చేసే నాయకులను హెచ్చరిస్తున్నా.. ప్రధాని మోదీ

ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచీని ఏర్పరిచాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని అందిస్తాయి. మహారాష్ట్ర, కేంద్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం

PM Modi: అలాంటి రాజకీయాలు చేసే నాయకులను హెచ్చరిస్తున్నా.. ప్రధాని మోదీ

I want to warn you against shortcut politics says PM Modi

PM Modi: షార్ట్‭కర్ట్ రాజకీయాలు చేయడం వల్ల దేశానికి పెద్ద శత్రువులుగా మారుతున్నారని, అలాంటి రాజకీయాలు మనుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. ఆదివారం మహారాష్ట్రంలోని నాగ్‭పూర్‭-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించవద్దని, రాజకీయ లబ్ది కోసం తొందరపాటు అడ్డదారులు మానుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి చేసినవనే విషయం వేరే చెప్పనక్కర్లేదు.

Salam Aarti Name Change : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆలయాల్లో సలాం ఆరతి ఉండదు!

‘‘షార్ట్‭కర్ట్ రాజకీయాలు చేసే వారిని నేను హెచ్చరిస్తున్నాను. అలాంటి రాజకీయ నాయకుల వల్ల ప్రజలు, దేశం ఇబ్బంది పడుతోంది. వారు దేశానికి అతిపెద్ద శత్రువులుగా మారుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, అధికారం చేపట్టేందుకు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. వారి అంతిమ లక్ష్యం పదవులే కానీ ప్రజలు కాదు. అలాంటి వారికి నేనొక విజ్ణప్తి చేస్తున్నాను. అభివృద్ధి గురించి ఆలోచించండి. ప్రజల అవసరాలు ఎలా తీర్చాలో ఆలోచించండి’’ అని ప్రధాని మోదీ అన్నారు.

Maharashtra: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై ఇంకు చల్లిన వ్యక్తి

ఇక నాగ్‭పూర్‭లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ ‘‘ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచీని ఏర్పరిచాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని అందిస్తాయి. మహారాష్ట్ర, కేంద్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం’’ అని అన్నారు.