కొత్త కారు కొన్నప్పుడు కూడా ఇంత ఆనందంగా లేను: సోనూ సూద్

  • Published By: vamsi ,Published On : August 21, 2020 / 10:49 AM IST
కొత్త కారు కొన్నప్పుడు కూడా ఇంత ఆనందంగా లేను: సోనూ సూద్

లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికులకు మరియు నిస్సహాయ ప్రజలకు మెస్సీయగా మారిపోయాడు. అనేక రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి ఇళ్లకు తిరిగి తీసుకుని రావడానికి సహాయం చేశాడు. అదే సమయంలో, సోనూ సోషల్ మీడియాలో ప్రజలతో నిరంతరం కనెక్ట్ అవుతున్నాడు. వారికి సహాయం చేస్తున్నాడు. ఇటీవల తన ట్విట్టర్ ఖాతా ద్వారా రోజూ ఎంత మంది తనను సంప్రదిస్తున్నారో వివరాలను కూడా సోనూ పంచుకున్నారు.



సోను సూద్‌కు సహాయం చేస్తున్న వారి సంఖ్య, సోనూ నుంచి సహాయం కోరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరో ఇమ్మిగ్రేషన్‌లో సహాయం అడిగితే సోనూ సాయం చేస్తున్నాడు. సోదరి ఆపరేషన్ కోసం డబ్బు లేదంటే సాయం చేస్తున్నాడు. ఇల్లు వరదలో కొట్టకుపోతే సాయం చేస్తున్నాడు. పుస్తకాలు వరద నీటిలో చెడిపోతే ఏది అయినా ఇప్పుడు కేరాఫ్ సోను సూద్ హెల్ప్‌లైన్‌.

ఇంతకుముందు లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఇంటికి చేరుకోవడానికి మాత్రమే వారి హెల్ప్‌లైన్‌లో కాల్స్ చేస్తుండేవారు. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్, హెల్ప్‌లైన్, ఈ-మెయిల్, ఇన్‌స్టాగ్రామ్ నుండి సహాయం కోసం వర్షంలా వినతులు వస్తున్నాయి, సోను సూద్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు, కాని అందరికీ సహాయం చేయడం అసాధ్యమని అందరికీ తెలుసిన విషయమే.



ఈ క్రమంలోనే బీహార్ వరదతో దెబ్బతిన్న కుటుంబానికి సహాయం చేయడానికి సోను సూద్ ముందుకు వచ్చారు. చంపారన్‌కు చెందిన భోలా అనే వ్యక్తి తన కొడుకును వరదలో కోల్పోయాడు. అంతేకాదు 2 గేదెలు అతనికి సంపాదించడానికి ఏకైక మార్గం. అవి కూడా దెబ్బతినగా.. సోను సూద్ అతనికి గేదెను ఇచ్చాడు. తద్వారా అతను జీవనం సాగిస్తున్నాడు. ఈ సంధర్భంగా ట్వీట్ చేసిన సోనూ.. తన జీవితంలో తొలిసారిగా కారు కొనుక్కునప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదంటూ ప్రకటించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, వీరి కోసం కొత్త గేదెను కొంటున్నపుడు కలిగిన ఆనందం తన తొలి కారు కొన్నపుడు కలగలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను బిహార్ వచ్చినపుడు ఈ గేదె ఒక గ్లాసు తాజా పాలు తాగుతానంటూ ట్వీట్ చేశారు. మరో ఘటనలో క్వారంటైన్ నిబంధనలతో హోటల్‌లో చిక్కుకున్న ఫ్యామిలీకి సోనూసూద్ అండగా నిలిచారు. మరో గంటలో మీరు ఇంటికి బయలుదేరబోతున్నారు. బ్యాగులు సర్దుకోమంటూ చెప్పిన సోనూ సూద్.. ఇచ్చిన మాట ప్రకారం వారికి సాయం చేశారు.