పుట్టగానే రాహుల్ ను ఎత్తుకున్నది నేనే : ఆస్పత్రి నర్సు రాజమ్మ

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2019 / 08:23 AM IST
పుట్టగానే రాహుల్ ను ఎత్తుకున్నది నేనే : ఆస్పత్రి నర్సు రాజమ్మ

రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమని ఓ మాజీ నర్సు ముందుకొచ్చింది.జూన్-19,1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో రాహుల్ పుట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులలో తాను కూడా ఒకరినని కేరళలోని వయనాడ్ కి చెందిన రాజమ్మ వవథిల్ తెలిపారు. రాహుల్ పుట్టిన సమయంలో హోలీ హాస్పిటల్ లో ట్రైనీ నర్స్ గా ఉన్న తాను రాహుల్ ను మొదటిగా చేతుల్లోకి తీసుకున్న వారిలో ఒకరిగా ఉన్నానని ఆమె తెలిపారు.ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ మనువడిని చూసి తాను చాలా థ్రిల్ కు గురయ్యానని ఆమె తెలిపారు.పుట్టినప్పుడు రాహుల్ చాలా ముద్దుగా ఉన్నట్లు ఆమె తెలిపారు.రాహుల్ పుట్టుకకు తాను సాక్ష్యమని రాజమ్మ తెలిపారు.సోనియాగాంధీని డెలివరీ కోసం హాస్పిటల్ కు తీసుకొచ్చినప్పుడు రాజీవ్ గాంధీ,సంజయ్ గాంధీ హాస్పిటల్ లో లేబర్ రూమ్ బయట నిలబడి ఉన్న సంఘటనను రాజమ్మ గుర్తు చేసుకున్నారు.

రాహుల్ పౌరసత్వంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన కంప్లెయింట్ పై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఓ భారతీయ పౌరుడిగా రాహుల్ ఐడెంటిటీ గురించి ఎవరూ ప్రశ్నించవసరం లేదన్నారు.స్వామి ఆరోపణలు బేస్ లెస్ అని ఆమె తెలిపారు.రాహుల్ పుట్టుకకు సంబంధించిన అన్ని రికార్డులు హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లోనే ఉన్నట్లు ఆమె సృష్టం చేశారు.హోలీ హాస్పిటల్ లో నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రాజమ్మ భారత ఆర్మీలో నర్సుగా చేరింది.వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత 1987లో ఆమె కేరళకు తిరిగి వెళ్లిపోయింది.ప్రస్థుతం ఆమె కల్లూర్ లో నివసిస్తుంది. రాహుల్ గాంధీ ఈ సారి వయనాడ్ కి వచ్చినప్పుడు తప్పకుండా ఆయనను కలుస్తానని రాజమ్మ చెప్పారు.