బాంబు పడిందా లేదా అన్నదే చూస్తాం.. లెక్కించడం మా పని కాదు : ఎయిర్ చీఫ్

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ స్ట్రయిక్స్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున టెర్రిస్టుల

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 08:10 AM IST
బాంబు పడిందా లేదా అన్నదే చూస్తాం.. లెక్కించడం మా పని కాదు : ఎయిర్ చీఫ్

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ స్ట్రయిక్స్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున టెర్రిస్టుల

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ స్ట్రయిక్స్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున టెర్రిస్టుల స్థావరాలపై దాడులు చేసి, వాటిని ధ్వంసం చేశామన్నారు. ఈ భీకర దాడిలో ఎంతమంది టెర్రరిస్టులు హతమయ్యారో లెక్క పెట్టలేదన్నారు. టార్గెట్ పూర్తి చేయడమే తమ లక్ష్యం అని ఎయిర్ చీఫ్ స్పష్టం చేశారు. ఎంతమంది చచ్చారు, గాయపడ్డారు అనే లెక్కలు ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మృతుల వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

ఉగ్ర శిబిరాలపై దాడులు నిరంతర ప్రక్రియ అని ధనోవా చెప్పారు. మిగ్ విమానాల నాణ్యతపై వస్తున్న ఆరోపణలను ఎయిర్ చీఫ్ ఖండించారు. మిగ్ జెట్ ఫైటర్లు పాతవి కాదని, వాటిని అప్ గ్రేడ్ చేశామని, వాటికి పూర్తి సామర్థ్యం ఉందని వివరించారు. త్వరలోనే రాఫెల్ యుద్ధ విమానాలు కూడా అందుబాటులోకి వస్తాయని, వైమానిక దళం మరింత శక్తిమంతం అవుతుందని ధనోవా అన్నారు.

వైమానిక దాడులు జరగలేదని పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై ఎయిర్ చీఫ్ మండిపడ్డారు. వైమానిక దాడులు జరక్కపోతే పాక్ ఎందుకు స్పందిస్తుందని ప్రశ్నించారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై స్పందించిన ఎయిర్ చీఫ్.. ఫిట్‌గా ఉంటేనే అభినందన్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం

బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన భీకర దాడిలో ఎంతమంది ముష్కరులు హతమయ్యారు అనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై రోజుకో వార్త వస్తోంది. రాజకీయ నాయకులు ఎవరికి తోచినట్టు వారు లెక్కలు చెబుతున్నారు. 350మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒకరు, 300మంది చనిపోయారని ఇంకొకరు, 200మంది చనిపోయారని మరొకరు.. ఇలా ఎవరికి వారికి స్టేట్‌మెంట్లు ఇచ్చి గందరగోళం సృష్టించారు. పాకిస్తాన్ మాత్రం మరో అడుగు ముందుకేసి.. ఎయిర్ స్ట్రయిక్స్‌లో అసలు ప్రాణనష్టమే జరగలేదని బుకాయించింది. ఈ తరుణంలో ఎయిర్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Also Read : ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఆహారం ఇచ్చిన పంజాబ్ పోలీసులు