పాక్ బోర్డర్ వద్ద భారత వాయుసేన సన్నాహాలు

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 07:11 AM IST
పాక్ బోర్డర్ వద్ద భారత వాయుసేన సన్నాహాలు

పాకిస్తాన్ సరిహద్దు దగ్గర భారత వాయుసేన భారీ సన్నాహకాలకు కసరత్తు చేస్తోంది. మార్చి 14వ తేదీ గురువారం రాత్రి పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో ఫైటర్ జెట్లు కసరత్తులో పాల్గొన్నాయి. అమృత్ సర్‌తో సహా పలుచోట్ల ఐఏఎఫ్ జెట్లు, ఎయిర్ క్రాఫ్ట్‌లు చక్కర్లు కొట్టాయి. పాకిస్థాన్ వాయిసేన నుండి ముప్పు ఎదురైనా తిప్పికొట్టేందుకు భారత వాయిసేన కసరత్తు చేసింది. ఒకవేళ భారత గగనతనంలోకి వచ్చినా ఎదుర్కొనేలా సన్నద్ధతమయ్యేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం బోర్డర్‌లోకి 2 పాక్ ఫైటర్ జెట్లు చొచ్చుకొచ్చాయి. పూంచ్ సెక్టార్‌కి 10 కి.మీటర్ల దూరంలో…సరిహద్దు వెంబడి ఫైటర్ జెట్లు దూసుకొచ్చాయని భారత్ గుర్తించింది. జేఈఎంపై దాడుల తరువాత పూర్తిస్థాయిలో వాయుసేన అప్రమత్తమైంది. 
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం

ఇటీవలే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్ వాయుసేన బలగాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. అనంతరం పాక్ దేశానికి చెందిన మిగ్ విమానాలు భారత్ సరిహద్దులోకి రావడం..భారత్ బలగాలు వాటిని తిప్పకొట్టాయి. ఈ క్రమంలో ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సైనికులకు పట్టబడ్డాడు. భారత్ చేసిన వత్తిడితో పాక్ చెర నుండి అభినందన్ విడుదలయ్యాడు. ఇరు దేశాల బోర్డర్ వద్ద టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంటోంది.