Mirage-2000 Crash..కుప్పకూలిన శిక్షణ విమానం

భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ మిరేజ్-2000 కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్​లోని మహారాజపుర ఎయిర్​బేస్​ నుంచి బయలుదేరిన

Mirage-2000 Crash..కుప్పకూలిన శిక్షణ విమానం

Plane

Mirage-2000 Crash   భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ మిరేజ్-2000 కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్​లోని మహారాజపుర ఎయిర్​బేస్​ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే భిండ్​ జిల్లాలోని మన్కాబాగ్ గ్రామంలో కూలిపోయింది.

భిండ్‌కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్కాబాగ్ గగనతలం మీదుగా వెళ్తోన్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎయిర్‌క్రాఫ్ట్ అదుపు తప్పింది. కుప్పకూలే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన పైలెట్ అభిలాష్ పారాశూట్ సహాయంతో కిందికి దూకారు. పొగలు కక్కుతూ ఆ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ మన్కాబాగ్ పొలాల్లో నేలకూలింది. ఈ సమయంలో చెవులు చిల్లులు పడే శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ నేలకూలిన చోట భారీగా గొయ్యి ఏర్పడింది. విమానం ముక్కలు ముక్కలైంది. దాని శకలాలు కొన్ని మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. దీన్నంతటిని స్థానికులు తమ సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు.

సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ప్రాథమికంగా నిర్ధారించింది.​ . ఈ ప్రమాదం నుంచి పైలట్​ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. ట్రీట్మెంట్ కోసం పైలెట్‌ను హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని..ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ తెలిపింది.

ALSO READ ఆపిల్‌కు షాకిచ్చిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్‌ 13ప్రో హ్యాక్!