IAS In Kanpur : మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్!

కాన్పూర్‌లో ఒక ఐఏఎస్ అధికారి మత మార్పిడులను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

IAS In Kanpur : మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్!

Ias (1)

IAS In Kanpur కాన్పూర్‌లో ఒక ఐఏఎస్ అధికారి మత మార్పిడులను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి “ఇఫ్తిఖరుద్దీన్” హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మఠ్ మందిర్ సమన్వయ కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు భూపేష్ అవస్థి ఆరోపించారు. కాన్పూర్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమానికి ఇఫ్తిఖరుద్దీన్ హాజరైన వీడియోను అవస్థి విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ పవన్ కళ్యాణ్ రాత్రి పదింటికి ఫోన్ చేసి తిట్టారు: పోసాని
ఈ వైరల్ వీడియోలో.. ఓ గదిలో కొందరు ముస్లిం వ్యక్తులు ఉన్నచోట ఐఏఎస్ అధికారి సమక్షంలో ఓ మౌలానా ప్రసంగాలు మతపరమైన ప్రసంగాలు భోదిస్తున్నట్లు కనిపిస్తొంది. IAS అధికారి అక్కడున్న వారితో మాట్లాడేటప్పుడు మత మార్పిడుల గురించి మాట్లాడటం కనిపిస్తోంది. ఇస్లాం స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడిందనే విషయంపై స్పష్టత లేదు.

ALSO READ  ఇదో పెద్ద షిప్..కాంగ్రెస్ లో చేరిన కన్నయ్య,జిగ్నేష్

ఐఏఎస్ అధికారి వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు సీబీసీఐడీ డీజీ జీఎల్ మీనా నేతృత్వంలో సిట్(Special Investigation Team) ఏర్పాటైంది. ఏడు రోజుల్లోగా సిట్..తన రిపోర్టును యూపీ ప్రభుత్వానికి అందించనుందని హోంశాఖ తెలిపింది.