మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 11:22 AM IST
మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

ఒడిషాలోని సంబల్ పూర్ లో మంగళవారం(ఏప్రిల్-16,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది. ప్రొటోకాల్ ఉల్లంఘించినందుకుగాను మొహమ్మద్ ను సస్పెండ్ చేసినట్లు ఈసీ తెలిపింది. ఈసీ నిబంధనల ప్రకారం ఎస్పీజీ భధ్రతకలిగినవారికి ఇలాంటి తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది.

అయినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన 1996 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ మొహమ్మద్ ను సస్పెండ్ చేసినట్లు ఈసీ తన ఆర్డర్ లో తెలిపింది.మంగళవారం మొహమ్మద్ నేతృత్వంలోని పోల్ అధికారులు మోడీ చాపర్ ను సడెన్ గా తనిఖీ చేశారు.మోడీ..హెలికాఫ్టర్ లో తన వెంట తీసుకెళ్తున్న కొన్ని పేపర్లను అధికారులు తనిఖీ చేశారు.సడెన్ చెకింగ్ కారణంగా 15 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి మోడీ చేరుకున్న విషయం తెలిసిందే.
Also Read : కాంగ్రెస్ కు షాక్ : చౌకీదార్ చోర్ హై ప్రకటనపై ఈసీ బ్యాన్

అయితే ఐఏఎస్ అధికారి మొహమ్మద్ ను ఈసీ  సస్పెండ్ చేయడాన్ని  కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు అధికారిక ట్విటర్‌ లో స్పందించిన కాంగ్రెస్….తన విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ప్రధాని వాహనంతో సహా ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకుల వాహనాలను తనిఖీ చేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి.

తన హెలికాప్టర్‌ లో మోడీ ఏం తరలించారు. దాన్ని దేశ ప్రజలు చూడకూడదని ఆయన కోరుకుంటున్నారా?’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఒడిశా ముఖ్యంత్రి నవీన్‌ పట్నాయక్‌,కర్ణాటక సీఎం కుమారస్వామి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ హెలికాప్టర్లలోనూ ఈసీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం