IAS Officer: ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి .. ఐఏఎస్‌ అధికారి

ఈ నేపథ్యంలోనే ఆయన ఓ మెసేజింగ్ గ్రూప్ లో కొందరు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి లీక్ అయ్యాయి. లోకేశ్ చాట్‌ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆయన నోటీసులు జారీచేశారు. ఆ చాట్‌ పై వారంలోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది.

IAS Officer: ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి .. ఐఏఎస్‌ అధికారి

Ias Officer

IAS Officer: తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఓ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలంటూ అభ్యర్దిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి లోకేశ్‌ కుమార్‌ జంగిడ్‌ మధ్యప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఓ మెసేజింగ్ గ్రూప్ లో కొందరు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి లీక్ అయ్యాయి. లోకేశ్ చాట్‌ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆయన నోటీసులు జారీచేశారు. ఆ చాట్‌ పై వారంలోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక ఈ నేపథ్యంలోనే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటు లోకేశ్ పోలీసులకు తెలిపాడు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్‌ జోహ్రికి లేఖ రాశారు. రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారని, ఆరు నెలలు సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నారు లోకేశ్.

ఇక బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తన సమస్యలు చెబుతూ తనను సొంత రాష్ట్రం మహారాష్ట్రకు డిప్యూటేషన్ మీద పంపాల్సిందిగా కోరాడు. ఇక లీకైన చాట్‌లో లోకేశ్‌ తాను అవినీతిని ఏమాత్రం సహించలేనని.. అందుకే తనను తరచుగా బదిలీ చేస్తున్నారని తెలిపారు. కాగా నాలుగేళ్ళ లోకేశ్ సర్వీసులలో 9 సార్లు బదిలీ అయ్యారు.