వేర్వేరు మతాలతో ఒకటై రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్ టాపర్స్

వేర్వేరు మతాలతో ఒకటై రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్ టాపర్స్

IAS toppers: యూపీఎస్సీ ఎగ్జామినేషన్ (2015 బ్యాచ్) టాపర్ టీనా దాబి పెళ్లి జరిగిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. భర్త ఐఏఎస్ అత్తర్ ఖాన్ లు పరస్పర అంగీకారంతో జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మొదలైన వారి రిలేషన్ గురించి దేశమంతా ఫోకస్ అయింది.

నాటి ఎగ్జామ్ ఫలితాల్లో.. టీనా ఫస్ట్ ర్యాంక్ దక్కించుకోగా, అత్తర్ ఖాన్ కు రెండో ర్యాంక్ వచ్చింది. వీరి పెళ్లి మత సామరస్యానికి గుర్తుగా ఉంటుందంటూ చాలా మంది కామెంట్లు చేశారు. వారిలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.



‘మీ ప్రేమ పెరిగి బలం పుంజుకుని ఇండియన్స్ అందరికీ ఇన్‍‌స్పిరేషన్ గా మారుతుంది. ప్రస్తుతమున్న మత విద్వేషాలు, నిర్లక్ష్యం పోయేందుకు సహకరిస్తుందనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని ట్వీట్ చేశారు.
https://10tv.in/ahmedabad-metro-services-suspended-during-covid-19-curfew/
దాబి, అత్తర్ రాజస్థాన్ క్యాడర్ లోని ఐఏఎస్ గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ లో ఫస్ట్ సాధించిన తొలి దళిత యువతి టీనా మాత్రమే. ఒక సంవత్సరం ఎక్కువ వయస్సున్న అత్తర్.. సౌత్ కశ్మీర్ కు చెందిన వాడు. దాబి భోపాల్ లో ఉంటుండేది. అతని పేరెంట్స్ ఇద్దరికీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ లో ఉద్యోగాలు.

ఆమె లేడీ శ్రీరామ్ కాలేజిలో పొలిటికల్ సైన్స్ చదువుకుంది. అత్తర్ హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఐఐటీ పూర్తి చేశారు. పెళ్లి అయిన తొలినాళ్లలో ఇద్దరూ ఒకే సిటీలో ఉండేవారు. కొన్నాళ్లకు టీనా దాబికి శ్రీ గంగానగర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పోస్టింగ్ ఇచ్చారు. అత్తర్ కు జైపూర్ సీఈఓగా పోస్టింగ్ ఇచ్చారు.