I&B Ministry: ఐఅండ్‌బీ మినిస్ట్రీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, ఎలన్ మస్క్ పేరుతో ట్వీట్లు

ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. జనవరి 12 బుధవారం హ్యాకర్లు దీనికి Elon Musk అనే పేరుతో ట్వీట్లు చేస్తూ గ్రేట్ జాబ్ అని...

I&B Ministry: ఐఅండ్‌బీ మినిస్ట్రీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, ఎలన్ మస్క్ పేరుతో ట్వీట్లు

I And B

I&B Ministry: ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. జనవరి 12 బుధవారం హ్యాకర్లు దీనికి Elon Musk అనే పేరుతో ట్వీట్లు చేస్తూ.. గ్రేట్ జాబ్ అని కామెంట్లు కూడా పెట్టారు. కొంతసేపటికీ మళ్లీ అకౌంట్ పై కంట్రోల్ తెచ్చుకోగలిగారు. ప్రొఫెల్ పిక్చర్ మార్చి, హ్యాకర్లు చేసిన ట్వీట్లను డిలీట్ చేయగలిగారు.

సరిగ్గా ఓ నెల క్రితం 2021 డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. హ్యాకింగ్ కు గురైన కాసేపటిలోనే క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తూ ట్వీట్లు చేశారు. జనవరి 3న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మన్ దేశీ మహిళా బ్యాంక్ అకౌంట్లు జనవరి 3న హ్యాక్ అయ్యాయి. ఆ సమయంలోనూ హ్యాకర్ Elon Musk పేరే వాడటం ఆలోచించాల్సిన విషయం.

బుధవారం తన అకౌంట్ పై తిరిగి కంట్రోల్ సాధించుకున్న ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా విషయాన్ని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా?