ముందస్తు జాగ్రత్తలు : సేఫ్ ప్లేస్‌కి 127 గ్రామాల ప్రజలు

  • Published By: madhu ,Published On : February 21, 2019 / 12:17 PM IST
ముందస్తు జాగ్రత్తలు : సేఫ్ ప్లేస్‌కి 127 గ్రామాల ప్రజలు

పుల్వామా తరహాలో మరిన్ని దాడులు చేయడానికి జైషే, హిజ్బుల్ ఉగ్రవాదుల సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఐబీ హెచ్చరికలతో కేంద్రం రెస్పాండ్ అయ్యింది. ఈ మేరకు సైన్యానికి పలు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు చేసింది. దీనితో జమ్మూ కాశ్మీర్‌‌లోని బోర్డర్ వెంబడి ఉన్న 127 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భారత ఆర్మీ బంకులు, సొరంగంలో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు ఆర్మీ కృ‌షి చేస్తోంది. 

ఎలా తెలిసింది : 
తాన్‌జీమ్ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఐబీ కూపీ లాగింది. కశ్మీర్‌లో సైన్యం ఉన్నంతకాలం దాడులు చేస్తామని సోషల్ మీడియాలో హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ పేరిట ఉన్న వీడియోను గమనించింది. పిల్లలతో బాంబు దాడులు జరుపుతామని అందులో హెచ్చరికలున్నాయని తెలుస్తోంది. కశ్మీరీలకు అన్యాయం జరిగితే కశ్మీర్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని చంపడానికి వెనకాడబోమని హిజ్బుల్ హెచ్చరిక చేసింది. పుల్వామా దాడిని మించిన భారీ దాడి జరిపే యోచనలో ఉందని…ఇందుకు సంబంధించిన ఉగ్రవాదుల కోడింగ్ భాషను నిఘా వర్గాలు డీ కోడ్ చేశాయి. 

భద్రత కట్టుదిట్టం : 
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌లే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ అంచనా వేస్తోంది. చౌకీబల్, తాంగ్‌ధర్ రూట్లలో ఈ దాడులు జరగవచ్చని నిఘా వర్గాల అంచనా. దీనితో అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేసింది. 

Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?