IBPS RRB Notification : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ

మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అదీ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.

IBPS RRB Notification : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ

Ibps Rrb Notification

IBPS RRB Notification : మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అదీ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఐబీపీఎస్‌ (Institute of Banking Personnel Selection) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) 10వేల 447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 8 నుంచి ప్రారంభం అయ్యింది. జూన్‌ 28 దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 10,447

ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) – 5096

ఆఫీసర్‌ స్కేల్‌-1 – 4119

ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) – 25

ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) – 43

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) – 10

ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) – 27

ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) – 32

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) – 59

ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) – 905

ఆఫీసర్‌ స్కేల్‌- 3 – 151

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 8, 2021

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 28, 2021

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850

ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021

మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2021

వెబ్‌సైట్‌:https://www.ibps.in/