బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే

10TV Telugu News

Fuel Prices rs 60: రాబోయే ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే దక్కుతుందని కేరళ బీజేపీ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. అందులోనే జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఉంటాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీలోకి చేరుస్తామని హామీ ఇచ్చేశారు. ఎన్నికల సందర్బంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా మాట్లాడారు.

అంతేకాకుండా ఎల్డీఎప్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఇది జాతీయ అంశం. దీన్ని లీడ్ చేయడానికి కొన్ని కారణమవుతున్నాయని బీజేపీ లీడర్ అన్నారు.

కేరళ మంత్రి థామస్ ఐజక్ ను ప్రశ్నిస్తూ.. జీఎస్టీ ఇందన వనరులపై ఎప్పటికీ యాడ్ చేసేది లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధరల వ్యత్యాసం కనిపిస్తుంటే వీటిని మాత్రం ఎందుకు జీఎస్టీలో కలపడం కుదరదని అన్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఫ్యూయెల్ ను రూ.60కి అందిస్తాం. కాలిక్యులేషన్ ను బట్టి నాకు అదే అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో అత్యధిక వ్యాట్ కారణంగా ఇప్పటికే రూ.100మార్కును దాటేసింది పెట్రోల్. ఫ్యూయెల్ ధర అమాంతం పెంచేయడంపై ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి.