Supreme Court: సోషల్ మీడియా యూజర్లకు గట్టి హెచ్చరిక చేసిన సుప్రీంకోర్టు.. జడ్జిలను ఏమైనా అంటే జైలుకేనట అంతేనట

శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్‌ రఘువంశి అనే వ్యక్తిపై హైకోర్టు సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.

Supreme Court: సోషల్ మీడియా యూజర్లకు గట్టి హెచ్చరిక చేసిన సుప్రీంకోర్టు.. జడ్జిలను ఏమైనా అంటే జైలుకేనట అంతేనట

Critisism: సోషల్ మీడియాలో విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. అందరిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. ప్రతి అంశంపై నెటిజెన్లు చర్చిస్తూనే ఉంటారు. అయితే కొంత కాలంగా జడ్జీలపై విమర్శలు రావడంపై న్యాయవ్యవస్థ గుర్రుగా ఉంది. పలు సందర్భాల్లో జడ్జీలపై విమర్శలు చేయడం సరికాదని కూడా చెప్పింది. అలాంటి వారికి శిక్షలు వేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే దాన్ని వాస్తవరూపంలోకి తీసుకువచ్చింది సుప్రీంకోర్టు. సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయాధికారులను దూషించిన వారిని శిక్షించడం సబబేనని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Hyderabad : హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం

సోషల్‌ మీడియాలో జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ బేల ఎం త్రివేది, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలలో కూడిన ధర్మాసనం సమర్థించింది. అనుకూలంగా తీర్పు రానంత మాత్రాన జడ్జిని దూషించలేరని తేల్చి చెప్పింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా స్వతంత్రంగా ఉండాలన్న అర్థం ఉందని పేర్కొంది. న్యాయాధికారిపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Wrestlers protest: గంగలో విసిరేస్తామన్నారు, ఏమైంది?.. రెజ్లర్లపై మరోసారి విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్‌ రఘువంశి అనే వ్యక్తిపై హైకోర్టు సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. అయితే క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.