Lady blackmailer case: నేను పెదవి విప్పితే ప్రభుత్వం కూలిపోతుంది.. ఎవరినీ వదిలిపెట్టను.. బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్

నేను ఎవరినీ విడిచిపెట్టను, నాకు 30 నిమిషాలు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ అన్నారు.

Lady blackmailer case: నేను పెదవి విప్పితే ప్రభుత్వం కూలిపోతుంది.. ఎవరినీ వదిలిపెట్టను.. బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్

Honeytrap Accused Archana Nag

Lady blackmailer case:నేను ఎవరినీ విడిచిపెట్టను, నాకు 30 నిమిషాలు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ అన్నారు. హనీ-ట్రాప్ చేయడం ద్వారా హై-ప్రొఫైల్, ధనవంతులను ట్రాప్ చేసి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సంపాదించిన ముఠాలో అర్చన నాగ్ కీలక వ్యక్తి. ఈ కేసుకు సంబంధించి ఆమె అక్రమ ఆస్తులపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మంగళవారం అర్చన నాగ్ ను కోర్టు ఎదుట హాజరుపర్చి మరో ఏడు రోజులు రిమాండ్ కు అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఝర్పాడ జైలు నుంచి ఆమెను క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఈడీ కార్యాలయంకు తరలించారు.

Basavalinga Swamy suicide..Honeytrap : హనీట్రాప్‌ చిక్కుకుని మఠాధిపతి బసవలింగ మహాస్వామి ఆత్మహత్య..

క్యాపిటల్ ఆసుపత్రి వద్ద అర్చన నాగ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పెదవి విప్పితే ప్రభుత్వమే కూలిపోతుంది. అందుకు మీడియా ముందు మాట్లాడేందుకు 30 నిమిషాలు అవకాశం ఇవ్వండి అని బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ కోరారు. కక్షతో తనను అరెస్టు చేయించినవారిని విడిచిపెట్టేది లేదని అన్నారు. శ్రద్ధాంజలి బెహరా, సినీ నిర్మాత అక్షయ పరిజ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంటే తననెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారని, ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపింది. తనను తాను నిరూపించుకోవడానికి తన వద్ద ప్రత్యేకమైన సాక్ష్యాలు ఉన్నాయని ఆమె పేర్కొంది.

Honey Trapping: హనీ ట్రాపింగ్‌కు పాల్పడ్డ యూట్యూబ్ కపుల్.. వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలు వసూలు

ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే..

ఒడియా సినిమా నిర్మాత పారిజాపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు తర్వాత పారిజా ఒక యువతితో ఉన్న అసభ్యకరమైన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్చన నాగ్, మరో మహిళ శ్రద్ధాంజలి బెహెరా తన నుంచి రూ. 3కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ పారిజా కూడా నాయపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశాడు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 20 మందికి పైగా నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు అర్చన హనీ-ట్రాప్‌లో చిక్కుకున్నారు. బాగా డబ్బున్న కస్టమర్లను సంతోషపెట్టడానికి హై-ప్రొఫైల్ కాల్ గర్ల్స్‌ను నియమించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అర్చన, ఆమె భర్త జగబంధు చంద్, వారి వ్యాపార భాగస్వామి ఖగేశ్వర్ లను పోలీసులు అరెస్టు చేశారు.