మాస్క్ పెట్టుకున్నా.. చిన్న తప్పే కరోనాకు కారణం అవుతోందట!

మాస్క్ పెట్టుకున్నా.. చిన్న తప్పే కరోనాకు కారణం అవుతోందట!

If Wearing Mask Small Mistake Can Causing For Corona Spread

Covid-19: దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది.. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతూ ఉండగా.. వేలల్లో మరణాలు లెక్కల్లో మాత్రమే ఉన్నాయి. లెక్కల్లోకి రాని మరణాలు ఎన్నో.. ఇటువంటి పరిస్థితిలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎంత హెచ్చరిస్తున్నా పాటించనివాళ్లు ఎందరో.. మాస్క్ పెట్టుకోనివారి సంగతి పక్కనబెడితే.. మాస్క్ పెట్టుకున్నా కూడా మాస్క్ విషయంలో చేస్తున్న చిన్న తప్పే కరోనాకు కారణం అవుతోందంట.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన కొన్ని సర్వేల్లో మాస్క్ పెట్టుకున్నా కూడా.. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్న చిన్న పొరపాట్లే కరోనాకు కారణం అవుతున్నాయి. మాస్క్ తీసేప్పుడు ముక్కు మీ పట్టుకుని తీయడం వల్ల కూడా కరోనా సోకినట్లుగా చెప్పారట. అంతేకాదు.. జ్వరంతో బాధపడుతున్నవారు కరోనా లక్షణాలతో ఉండేవారు.. లక్షల్లో ఉండగా.. టెస్ట్‌లు చేసుకోకుండా బయట తిరుగుతున్నట్లుగా గుర్తించారు.

కరోనా టెస్ట్‌లు బాగా సీరియస్ అని అనుకున్న సమయంలోనే ఎక్కువమంది చేయించుకుంటున్నారని, ఈ క్రమంలో లక్షణాలు ఉండి కరోనా నిర్ధారణ కానివారు, లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతున్నవారు కలవడంతో పరిస్థితి అదుపులోకి తేలేకపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. టెస్టింగ్ సమయంలో కూడా కరోనా ఉన్నవారు.. లేనివారు గంటల తరబడి ఒకేచోట కలిసి నిలబడి ఉండడం కూడా కరోనాకు కారణం అవుతోందని అంటున్నారు.

కరోనా లక్షణాలు కనిపించగానే కరోనా టెస్టింగ్ చేయించుకున్నా.. చేయించుకోకపోయినా కూడా స్వీయ నిర్భంధంలో ఉండడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు అధికారులు. కుటుంబ సభ్యులకు, తమతో సన్నిహితంగా మెలిగిన వారికి వైరస్‌ వ్యాపించేందుకు పరోక్షంగా కారణం కాకుండా ఉండాలని సూచిస్తున్నారు.