Anand Mahindra : కొత్త చిట్కా చెప్పిన మహీంద్రా..ఆదివారం వ్యాయామం చేయకపోయినా..ఈ వీడియో చూస్తే చాలు

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..కొత్త కొత్త విషయాలు చెబుతుంటారు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా. తన ఫాలోవర్లకు వీడియోలు, ఇతరత్రా విషయాలు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. వీటిలో కొన్ని నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా..మరొక వీడియోతో ముందుకు వచ్చారు మహీంద్రా.

10TV Telugu News

Anand Mahindra Tweet : సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..కొత్త కొత్త విషయాలు చెబుతుంటారు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా. తన ఫాలోవర్లకు వీడియోలు, ఇతరత్రా విషయాలు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. వీటిలో కొన్ని నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా..మరొక వీడియోతో ముందుకు వచ్చారు మహీంద్రా. ఆదివారం ఎక్సర్ సైజ్ చేయని వారు ఈ వీడియో చూస్తే చాలు అంటూ ట్వీట్ లో వెల్లడించారు.

Read More : B.tech Baba : బీటెక్ బాబా…. మహిళా భక్తులపై లైంగిక వేధింపులు

ఈ వీడియోలో జిమ్నాస్ట్ లు చేసిన విన్యాసాలు ఉన్నాయి. వాళ్లు చేసిన విన్యాసాలు చూస్తుంటే..వావ్ అనిపించకమానదు. అంతేగాకుండా…వ్యాయామం చేయకపోయినా..శరీరంలోని ప్రతి కండరం కదిలినట్లు అనిపించడం ఖాయం. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. రోజూ ఎక్సర్ సైజ్ చేస్తున్న వారు ఆదివారం వచ్చే వరకు..కొంత బద్ధకంగా ఉంటారని ఆయన తెలిపారు.

Read More : Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆదివారమూ కొనసాగించేందుకు ఉత్సాహం చూపని వారికి ఓ పరిష్కారం ఉందని, తనలాగే ఈ వీడియో క్లిప్ ను సేవ్ చేసుకోవాలని సూచించారు. కనీసం రెండుసార్లు ఈ వీడియో చూడాలని, ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్ కలుగుతుందన్నారు. మీరు అలసిపోతారు అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఆయన.

10TV Telugu News