నీ డబ్బుని తగలబెట్టాలనుకుంటే మంచిది…సీరం CEOతో వ్యాక్సిన్ కింగ్ ఏమన్నారంటే

నీ డబ్బుని తగలబెట్టాలనుకుంటే మంచిది…సీరం CEOతో వ్యాక్సిన్ కింగ్ ఏమన్నారంటే

Adar Poonawalla’s father told him ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)పేరు గడించింది. చౌక ధరకు వ్యాక్సిన్లను సరఫరా చేయగల సంస్థగా ప్రపంచవ్యాప్తంగా “సీరం” గుర్తింపుపొందింది. ప్రస్తుత కరోనా సమయంలో ప్రపంచమంతా సీరం వైపే చూస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా, కోడజెనిక్స్‌, నోవావాక్స్‌, థెమిస్‌ వంటి అంతర్జాతీయ ఔషధ సంస్థలు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం.. సీరంతో భాగస్వామయ్యేందుకు క్యూ కట్టిన విషయం తెలిసిందే.

కరోనా కట్టడి కోసం ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన “కోవిషీల్డ్” వ్యాక్సిన్ ని భారత్ లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే. సీరంలో కోవిషీల్డ్ క్లినికల్ ట్రయిల్ కూడా జరిగాయి. అయితే, ఇవాళ(జనవరి-1,2021)కేంద్ర నిపుణుల కమిటీ..దేశంలో కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక డీజీసీఐ అనుమతి ఇచ్చిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఈ వారంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భారత్ లో మొదటగా అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ గా సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోన్న “కోవిషీల్డ్” నిలవనుంది.

కాగా, కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సీరం సీఈవో అదార్ పూనవల్లా మాట్లాడుతూ… తన కుటుంబ సంపదలో 250 మిలియన్ డాలర్లు కరోనా వ్యాక్సిన్ కోసం పెట్టారని వెల్లడించారు. ఈ విషయంలో భారతదేశ వ్యాక్సిన్ కింగ్ గా పిలువబడే తన తండ్రి సైరస్ పూనవల్లా నుంచి ప్రారంభంలో విమర్శకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇంత డబ్బు అక్కడ పెట్టుబడిగా పెట్టడం అనేది జూదం కాదు అని తన తండ్రి అనుమానం వ్యక్తం చేశాడన్నారు. సరే..ఇది నీ డబ్బు. నువ్వు దానిని తగులబెట్టాలనుకుంటే మంచిది అని తన తండ్రి మొదట్లో అన్నడంటూ అదార్ పూనవల్లా తన తండ్రి యొక్క మొదటి రియాక్షన్ ను వివరించాడు.