మానవరహిత డ్రోన్ హెలికాప్టర్

మానవరహిత డ్రోన్ హెలికాప్టర్

drone helicopter : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. హెలికాప్టర్, విమానాల మాదిరిగా..డ్రోన్లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ..వాటిని తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఎన్నో పనులు చేసే విధంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే సైన్యంలోకి వీటిని ప్రవేశపెట్టనున్నారు. అంతేగాకుండా..రైతులకు ఉపయోగపడే విధంగా డ్రోన్లను తయారు చేస్తున్నారు. తాజాగా…మానవరహిత డ్రోన్ హెలికాప్టర్ ను తయారు చేసింది ఐఐటీ కాన్పూర్.

ఎరోనాటిక్స్ విభాగం ఒక స్టార్టప్ సంస్థ సహకారంతో దీనిని అభివృద్ధి చేసింది. ఇది పెట్రోల్ తో పనిచేస్తుందని, ఐదు కిలోల వరకు బరువు మోయగలదని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ అభిషేక్ వివరించారు. నిఘా, పర్యవేక్షణ కోసం దీనిని తయారు చేయడం జరిగిందన్నారు. అంతేగాకుండా..వ్యాక్సిన్ పంపిణీకి కూడా ఈ డ్రోన్ హెలికాప్టర్ లను ఉపయోగించవచ్చన్నారు. డ్రోన్ హెలికాప్టర్ ను ఇటీవలే పరీక్షించడం జరిగిందని, 11,500 అడుగుల ఎత్తు వరకు ఎగిరిందన్నారు. డ్రోన్ హెలికాప్టరు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుందని, అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నామన్నారు. ఇక బ్యాటరీతో నడిచేలా మరింత ఎత్తుకు చేరుకొనే డ్రోన్ తయారు చేయడంలో నిమగ్నమయినట్లు ప్రొఫెసర్ అభిషేక్ తెలిపారు.