Artificial Heart : కృత్రిమ గుండె.. రెండేళ్లలో మనుషులకు ఇంప్లాంట్

గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటీ కాన్పూర్ తీపి కబురు అందించింది. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Artificial Heart : కృత్రిమ గుండె.. రెండేళ్లలో మనుషులకు ఇంప్లాంట్

artificial heart

Artificial Heart : గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటీ కాన్పూర్ తీపి కబురు అందించింది. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి దీనిని జంతువులకు అమర్చి పరీక్షిస్తామని పేర్కొన్నారు.

ఆ ప్రయోగం సక్సెస్ అయితే రెండేళ్లలో మనుషులకు అమర్చుతామని వెల్లడించారు. ఐఐటీ కాన్పూర్ కు చెందిన 10 మంది శాస్త్రవేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హృద్రోగ వైద్యులతో కలిసి ఈ గుండెను తయారు చేసినట్లు తెలిపారు. గుండె మార్పిడి అవసరమైన వారికి ప్రస్తుతం ఇతరులు తమ గుండెను దానం చేస్తేనే లభిస్తుంది.

3D Printing Technology : కృత్రిమ చెవులు, ముక్కు..త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సృష్టి

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తమ కృత్రిమ గుండె గొప్ప విజయమని అభయ్ పేర్కొన్నారు. గుండె వైద్యానికి సంబంధించిన పరికరాలు, స్టంట్ల వంటివి ప్రస్తుతం 80శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.