IIT-Madras లేడీస్ బాత్రూమ్‌లో కెమెరా పెట్టిన లెక్చరర్

IIT-Madras లేడీస్ బాత్రూమ్‌లో కెమెరా పెట్టిన లెక్చరర్

ఐఐటీ మద్రాస్ ప్రాజెక్ట్ ఎంప్లాయ్.. పీహెచ్‌డీ విద్యార్థి వాష్‌రూమ్‌కు వెళ్తుండగా అందులో కెమెరా పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. టాయిలెట్ కు వెళ్లిన సమయంలో గోడకు రంధ్రం ఉన్న సంగతిని గమనించిన యువతి అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చింది. గోడ వెనుక ఉన్న సెల్‌ఫోన్ ఉన్న సంగతిని గుర్తించి విచారణ జరపడంతో  అందులో ప్రాజెక్టు ఆఫీసర్ సుభం బెనర్జీ ఫోన్ ఉన్నట్లు కన్‌ఫామ్ చేసుకున్నారు. 

ఏరో స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీసర్‌పై కేసు నమోదు చేశారు. ఐఐటీ మద్రాస్ స్టాఫ్  పోలీసులకు మెసేజ్ ఇవ్వడంతో ఘటనాస్థలానికి వచ్చి నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ టెస్టుకు పంపిన అధికారులకు అందులో ఎటువంటి వీడియో లభించలేదని తెలిపారు. విచారణ కొనసాగించనున్నట్లు పోలీసులు అధికారులు.