అమ్మ త్యాగానికి మరిచిపోలేని సత్కారం

అమ్మ త్యాగానికి మరిచిపోలేని సత్కారం

తన తల్లి తపన అందరికీ తెలియాలనుకున్నాడు. ఆమె పడ్డ కష్టం, చేసిన త్యాగాన్ని ఎన్నటికీ గుర్తుండిపోయేలా గౌరవించుకోవాలనుకున్నాడు. తన ఎదుగుదల కోసం ఆ తల్లి ఖర్చు చేసిన జీవితం, పస్తులున్న రోజులు అంద0రికీ గర్వంగా చెప్పాలనుకున్నాడు. విజయోత్సాహంతో ఉన్న తన ముఖాన్ని మొదటిగా తల్లే చూడలనుకుని IIT గ్రాడ్యుయేషన్ వేడుకకు తల్లినీ తీసుకెళ్లాడో కొడుకు.

Prakash Jadhav అనే వ్యక్తి తన గ్రాడ్యయేషన్ డ్రెస్ లో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. డిగ్రీ పొందిన ఆ అబ్బాయి కంటే పదిరేట్లు ఎక్కువ ఆనందాన్ని వ్యక్తం చేసింది తన తల్లి.

ప్రకాష్ మాట్లాడుతూ.. నా జీవితంలో అత్యంత విలువైన రోజు ఇదే అని అన్నారు. నా తల్లి చేసిన ప్రార్థనలు నాకు గుర్తున్నాయి తన జీవితమంతా నాకు మాత్రమే అంకితం చేసింది అన్నారు.

అంతేకాదు ప్రకాష్ తన జీవితాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి తన తల్లి చేసిన ప్రయత్నాలను మరచిపోకుండా, అభినందిస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. ఈ ఎమోషనల్ పోస్టుకు చాలా మంచి ప్రశంసలు వచ్చాయి.