Ilayaraja politics : మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ పదవి..రంగం సిద్ధం చేసిన అధిష్టానం..!

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఎంపీ పదవి..! సంగీత మాంత్రికుడు పెద్దల సభలో అడుగు పెట్టనున్నారని సమాచారం..

Ilayaraja politics : మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ పదవి..రంగం సిద్ధం చేసిన అధిష్టానం..!

Ilayaraja Politics

Ilayaraja politics  : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అన్నట్లుగా ప్రముఖ సంగీత దర్శకుడు..మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు బీజేపీ ఎంపీ పదవి ఇవ్వనున్నట్లుగా పక్కా సమాచారం. ప్రధాని మోడీని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తో ఇయళరాజా పోల్చారు. మోడీపై సంగీత మాంత్రికుడు ఇళయరాజా ప్రశంసలు కురిపించాడు. దీంతో ఆయనకు ఎంపీ (నామినేట్ పదవి) పదవికి ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. దీంతో ఇళయరాజా పెద్దల సభలో అడుగు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.

సంగీత రంగం నుంచి ఇయళరాజాను బీజేపీ నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. సుబ్రహ్మణ్యస్వామి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇళయరాజాను రాజ్యసభకు పంపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ప్రకటించనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

అంబేద్కర్ & మోదీ-రీఫార్మ్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ (Ambedkar & Modi – Reformer’s Ideas, Performer’s Implementation) పుస్తకానికి ఇళయరాజా ముందుమాట రాసారు. ఈ సందర్భంగా ఆయన మోడీ అంబేద్కర్ ఆశయాలను నెరవేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

తమిళనాడులోని అధికార పార్టీ సభ్యులు ఇళయరాజాపై తీవ్రంగా మండిపడ్డారు. ఇళయరాజా ఆరెస్సెస్ ఏజెంట్‌ అంటూ విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో ఇళయరాజాను రాజ్యసభకు పంపేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.