Anand Mahindra : వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. ఆనంద్ మహీంద్రా వార్నింగ్

సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. నకిలీ వార్తలు, ఫేక్ పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.

Anand Mahindra : వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. ఆనంద్ మహీంద్రా వార్నింగ్

Anand Mahindra

Anand Mahindra : సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. నకిలీ వార్తలు, ఫేక్ పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు ప్రముఖుల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నకిలీ పోస్టులు వైరల్ చేస్తున్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఆ పోస్టు పెట్టింది నేను కాదు అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, తన పేరుతో నకిలీ పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు.

Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం

కొన్ని రోజులుగా మహీంద్రా పేరుతో నెట్టింట్లో ఫేక్‌ న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన చెప్పని మాటలను ఆయనకు ఆపాదించారు. దీంతో ఆనంద్ సార్ కి కోపం వచ్చింది. అసహనంగా ఫీల్ అయ్యారు. అవి పూర్తిగా కల్పిత వార్తలని స్పష్టం చేశారు. అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

‘సగటు భారతీయుడు నెట్టింట్లో మహిళలను అనుసరిస్తూ, క్రీడా జట్లపై తన ఆశలన్నీ పెట్టుకొని, తమ గురించి పట్టించుకోని రాజకీయ నాయకుల చేతిలో తన భవిష్యత్తును పెట్టేస్తున్నాడు’ అని ఆనంద్ మహీంద్రా అన్నట్లుగా ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. start_upfounder అనే ఇన్‌స్ట్రాగాం ఖాతాలో ఇది అప్‌లోడ్ అయింది. ఇది చూసి మహీంద్రా కంగుతిన్నారు. తానసలు అలాంటి ట్వీట్ చేయలేదని చెబుతూ సీరియస్ అయ్యారు. తానెప్పుడూ ఆ మాట చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు వీళ్లు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే

ఇదే కాదు.. కొన్నిరోజుల కిందట కూడా మహీంద్రా పేరుతో నకిలీ వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారని, స్కూల్‌ పిల్లలకు స్టాక్‌ మార్కెట్‌ పాఠాలు చెప్పాలని మహీంద్రా సూచించారంటూ ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. వీటిని ఎప్పటికప్పుడు మహీంద్రా కొట్టిపారేశారు. ట్విటర్‌లో ఆనంద్‌ కు మంచి ఫాలోయింగ్ ఉంది. 80లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.