Iam Back : మళ్లీ రింగులోకి Mike Tyson

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 07:23 AM IST
Iam Back : మళ్లీ రింగులోకి Mike Tyson

Iam Back మళ్లీ రింగులోకి వస్తున్నానంటూ…54 ఏళ్ళ Mike Tyson ఘీంకరిస్తున్నాడు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత..మళ్లీ ఆయన ఫైటింగ్ చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరలా టైసన్ పంచ్ లు, ఫైటింగ్ చూడొచ్చని అభిమానులు ఆనంద పడుతున్నారు.

వివాదాస్పద హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన టైసన్..2020, సెప్టెంబర్ 12వ తేదీన Frontline Battle పేరిట 8 రౌండ్లు జరిగే ఎగ్జిబీషన్ మ్యాచ్ లో Roy Jones Jr తో ఫైటింగ్ చేయబోతున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం వేదికగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


ఎగ్జిబీషన్ మ్యాచ్ కోసం స్ట్రీమింగ్ హక్కులు సాధించుకోవడానికి ఓ వ్యక్తి రూ. 50 మిలియన్లు చెల్లించాడు. లెజెండ్స్ ఓన్లీ లీగ్ అనే కొత్త స్పోర్ట్స్ వెంచర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపాడు. దీని ద్వారా కొత్త వారిని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని టైసన్ తెలిపారు.

Mike Tyson గురించి అందరికీ తెలిసిందే. ఆయన విసిరే పంచ్ లతో ప్రత్యర్థిని ఎలా మట్టికరిపిస్తాడో కల్ల ముందు మెసలుతుంటుంది. 44 నాకౌట్లతో సహా 50 విజయాలు సాధించాడు. చివరిసారిగా…2005, జూన్ 11వ తేదీన Kevin McBrideతో తలపడ్డాడు.

WBA, WBC, IBF టైటిళ్ల‌ను గెలిచిన Miketyson కు సంబంధించిన ఓ వీడియో ఇటీవలే వైరల్ అయ్యింది. 20 సంవత్పరాల వయస్సులో 1986లో ట్రైవర్ బెరిబిక్ ను ఓడించి ప్రపంచ యువ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచాడు. Miketyson త‌న కెరీర్‌లో మొత్తం 50 ప్రొఫెష‌న‌ల్ ఫైట్స్‌ను గెలిచాడు.


Roy Jones Jr విషయానికి వస్తే…51 సంవత్సరాల ఇతను…47 నాకౌట్లతో 66 విజయాలు సాధించాడు. 2018లో రిటైర్ మెంట్ ప్రకటించాడు. middleweight, super middleweight, light heavyweight and heavyweight టైటిళ్లను సాధించాడు.