MLA Comment: ‘ఎలక్ట్రిసిటీ వద్దు.. నాకు ఎమ్మెల్యే కావాలి’ అడిగిన మహిళకు ఎమ్మెల్యే రిప్లై

ట్విట్టర్ యూజర్ నుంచి వచ్చిన కామెంట్ కు అదే రేంజ్ లో రెస్పాండ్ అయ్యారు ఆప్ ఎమ్మెల్యే. ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దాకు క్రేజీ కామెంట్ వచ్చింది.

MLA Comment: ‘ఎలక్ట్రిసిటీ వద్దు.. నాకు ఎమ్మెల్యే కావాలి’ అడిగిన మహిళకు ఎమ్మెల్యే రిప్లై

Raghav Chadha

MLA Comment: ట్విట్టర్ యూజర్ నుంచి వచ్చిన కామెంట్ కు అదే రేంజ్ లో రెస్పాండ్ అయ్యారు ఆప్ ఎమ్మెల్యే. ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దాకు క్రేజీ కామెంట్ వచ్చింది. అది కూడా అతని ప్రజాసేవ చూసి కాదు. అతని లుక్స్ చూసి… ‘ఎలక్ట్రిసిటీ వద్దు.. నాకు రాఘవ్ కావాలి’ అని పోస్టు చేసింది.

ఆ ట్వీట్ పై రెస్పాండ్ అయిన ఎమ్మెల్యే.. ఎలక్ట్రిసిటీ మాత్రమే ఇస్తామని చెప్పాం. కానీ, తనని సమర్పించుకునేందుకు మ్యానిఫెస్టోలో అతని పేరు లేదని రిప్లై ఇచ్చారు. 24గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం కానీ, నన్ను నేను ఇచ్చుకోలేనని చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్ లో ఆ మహిళ ట్వీట్ బ్లాక్ చేసి ఉండటంతో పబ్లిక్ కు డిస్ ప్లే అవడం లేదు. దానిని ఆప్ఎమ్మెల్యే స్వయంగా స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్, ఇన్ స్టాల్లో పంచుకున్నారు. పైగా #KejriwalDiGuarantee అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా వాడారు. సర్ జీ రిప్లై.. సెన్సాఫ్ హ్యూమర్ తో ఉందంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రీసెంట్ గా 300యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చేసారి గెలిస్తే 24గంటల పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పింది. ఈ మేరకు పంజాబ్ నుంచి 117అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేందుకు సోమవారం పేర్లను కూడా ప్రకటించింది. ఈ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరుగుతాయి.