ఎకానమీ గురించే బాధ : తీహార్ జైలుకి వెళ్లే ముందు చిదంబరం

ఎకానమీ గురించే బాధ : తీహార్ జైలుకి వెళ్లే ముందు చిదంబరం

INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి గురువారం(సెప్టెంబర్-5,2019) ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లనని.. అవసరమైతే ఈడీకి లొంగిపోతానని చిదంబరం అభ్యర్థించగా.. న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో చిదంబరాన్ని గురువారం అధికారులు తీహార్ జైలుకి తరలించారు.

అయితే గురువారం సాయంత్రం తీహర్ జైలుకి వెళ్లేముందు కోర్టు ఆవరణలో చిదంబరం రిపోర్టర్ లతో మాట్లాడుతూ…మోడీ సర్కార్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తాను కేవలం దేశ ఆర్థికవ్యవస్థ గురించి మాత్రమే భయపడుతున్నానని అన్నారు. ఇంతకుముందు 5శాతం జీడీపీ అంటూ మోడీ సర్కార్ పై చిదంబరం సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 19,2019 వరకూ ఆయనను తీహార్ జైలులో ఉంచుతారు. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు.  జెడ్ కేటగిరి భద్రత దృష్యాలో జైల్లో ప్రత్యేక సదుపాయాలకు కోర్టు అంగీకరించింది. ప్రత్యేక గది,వెస్ట్రన్ టాయిలెట్‌ సౌకర్యంతో పాటు మందులను అందించేందుకు అనుమతిచ్చింది