వాతావరణశాఖ నివేదిక : నైరుతిలో భారీ వానలు

రైతులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. 

  • Published By: madhu ,Published On : April 15, 2019 / 10:25 AM IST
వాతావరణశాఖ నివేదిక : నైరుతిలో భారీ వానలు

రైతులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. 

రైతులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్‌నినో బలహీన పడడంతో మంచి వర్షాలు పడతాయని నివేదిక విడుదల చేసింది. నైరుతీ రుతుపవన కాలంలో సాధారణం కంటే అధికంగా.. భారీగా వానలు పడతాయని రైతులకు చల్లని కబురు చెప్పింది. 2019లో దేశ వ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని.. నైరుతి రుతుపవనాల సమయంలో మాత్రం ఆశించిన స్థాయిలోనే.. వానలు బాగా పడతాయని వెల్లడించింది. జూన్ వరకు వెదర్ రిపోర్ట్ వెల్లడించింది భారత వాతావరణశాఖ.

2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఐఎండీ అంచనాలు వెల్లడించింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని ఐఎండీ సీనియర్ అధికారి వెల్లడించారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపిన ఐఎండీ దీర్ఘకాలికంగా 96 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్‌ నెలలో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామన్నారు. 
Read Also : చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు : నెల్లూరు జిల్లాలో కలకలం

రుతుపవనాల ప్రభావంపై పూర్తిస్థాయి అంచనాలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 96 నుండి 104 శాతం వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతం లేదా సరాసరి వర్షపాతంగా పరిగణిస్తారు. దేశంపై జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. వ్యవసాయరంగం ఉత్పత్తి పూర్తిగా నైరుతి రుతుపవనాల ప్రభావంపైనే ఆధారపడి ఉంటుందనే సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ సంవత్సరం ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఎండలు ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగుంటుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ఈసారైనా విస్తారంగా వర్షాలు కురుస్తాయని రైతులు భావిస్తున్నారు. 
Read Also : ఇదేం దారుణం : వీధికుక్కలకు అన్నం పెట్టిందని ఫైనేశారు