వానలే వానలు : ముంబైలో రెడ్ అలర్ట్

  • Published By: madhu ,Published On : September 5, 2019 / 08:27 AM IST
వానలే వానలు : ముంబైలో రెడ్ అలర్ట్

మహారాష్ట్రలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబైలోని పలు ఏరియాలో ఉన్న ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్‌లు నీటిలో మునిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పలు ఏరియాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని తెలిపింది. అందెరీ ఈస్ట్ ముంబై రికార్డు స్థాయిలో 214 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వెల్లడించింది. అందెరీ వెస్ట్, విక్రోలీ, మరోల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సెప్టెంబర్ 05వ తేదీ గురువారం రికార్డు స్థాయిలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రైలు పట్టాలపై నీళ్లు ప్రవహిస్తుండడంతో పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది అక్కడి రైల్వే శాఖ. 

ఏదైనా సహాయం కావాలనుకొనే వారు 1916కు కాల్ చేయాలని వాతావరణ అధికారులు సూచించారు. సియోన్, పరేల్, కింగ్స్ సర్కిల్, దాదర్, బైకుల్లాలో నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు సియోన్ రైల్వే స్టేషన్‌లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 30 విమానాలను అధికారులు రద్దు చేశఆరు. మరో 118 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.