IMD Alert : దంచికొడుతున్న వానలు , నాలుగు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..ఐఎండీ అలర్ట్

తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా...భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గురువారం ఉదయం నుంచి వానలు దంచికొడుతున్నాయి.

IMD Alert : దంచికొడుతున్న వానలు , నాలుగు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..ఐఎండీ అలర్ట్

Tamilnadu

Rainfall In Chennai : తమిళనాడు రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం, అల్పపీడనం కారణంగా…రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో రాష్ట్రాన్ని వరుణుడు వీడడం లేదు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు చెన్నైతో పాటు కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు తమిళనాడు డెల్టా ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది.

Read More : Rakesh Tikait : రైతుల ఉద్యమానికి ఏడాది…డిమాండ్లు అంగీకరిస్తేనే ఇళ్లకు వెళుతాం

తాజాగా…తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా…భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గురువారం ఉదయం నుంచి వానలు దంచికొడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ చెరువులా దర్శనమిస్తున్నాయి. తూత్తుకుడి జిల్లాలో..ఎక్కడా విరామం ఇవ్వకుండా వానలు పడుతున్నాయి. 200 మిలిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా..చెన్నై ఎయిర్ పోర్టు రన్ వేపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

Read More : Navjot Sidhu : నిరాహార దీక్ష చేస్తా..చన్నీ ప్రభుత్వానికి సిద్ధూ హెచ్చరిక

పలు విమానాల దారి మళ్లించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని..సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తూత్తుకుడి, తెనకాశీ, తిరునల్వేలి, చెంగల్ పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వానల కారణంగా..ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.