IMD : వడగాలుల ముప్పు, పెరగనున్న ఉష్ణోగ్రతలు

పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది.

IMD : వడగాలుల ముప్పు, పెరగనున్న ఉష్ణోగ్రతలు

Heat

Heat Wave India : భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లలో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండనుందని తెలిపింది.

సాధారణ ఉష్ణోగ్రతల కంటే…6.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హీట్ వేవ్ అని ప్రకటించడం జరుగుతుందని ఐఎండీ అధికార ప్రతినిధి కుల్దీప్ శ్రీవాత్సవ తెలిపారు. వర్షాకాలంలోను అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 40 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కుల్దీప్ తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం రుతుపవనాలు ఆలస్యంగా రావడమేనని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది.