Cyclone : షహీన్ దూసుకొస్తోంది..అప్రమత్తంగా ఉండండి

ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాన్ మధ్య అరేబియా తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. తర్వాత తీవ్ర తుపాన్ గా మారనుంది.

Cyclone : షహీన్ దూసుకొస్తోంది..అప్రమత్తంగా ఉండండి

Cyclone

Cyclone Shaheen : గులాబ్ తుపాన్ సృష్టించిన కల్లోలం ఇంకా కళ్ల ముందే మెదులుతోంది. మరో తుపాన్ దూసుకొస్తోంది. గులాబ్ ధాటికి వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. వస్తున్న తుపాన్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని…భయపడిపోతున్నారు. అరేబియా సముద్రంలో ఈ తుపాన్ ఏర్పడింద. దీనికి షహీన్ అని పేరు పెట్టారు. మొత్తం ఏడు రాష్ట్రాలపై తుపాన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సిక్కిం, రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read More : South Africa : మరిచిపోయిన రూ. 556 కోట్ల ఆస్తి తిరిగొచ్చింది

ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాన్ మధ్య అరేబియా తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. తర్వాత తీవ్ర తుపాన్ గా మారనుంది. పాక్ లోని మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుందని, తర్వాత 36 గంటల్లో దిశ మార్చుకుని..గల్ఫ్ ప్రాంతాలపై వెళ్లి…ఆ తర్వాత…బలహీన పడుతుందన్నారు. షహీన్ తుపాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.