Gulf Contries-Bharath : గల్ఫ్‌లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది?

గల్ఫ్ దేశాలు భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయా? గల్ఫ్‌లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది? గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుంది? వివాదం మరింత ముదిరితే గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే భారతీయ కార్మికుల భవిష్యత్ ఏంటి? అసలీ వివాదానికి ఫుల్‌స్టాప్ పడే మార్గమేంటి?

Gulf Contries-Bharath : గల్ఫ్‌లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది?

Bjp Leaders' Remarks On Muhammad Prophet (2)

GULF Contries serious on India : గల్ఫ్ దేశాలు భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయా? గల్ఫ్‌లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది? గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుంది? వివాదం మరింత ముదిరితే గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే భారతీయ కార్మికుల భవిష్యత్ ఏంటి? అసలీ వివాదానికి ఫుల్‌స్టాప్ పడే మార్గమేంటి?

గల్ఫ్‌ దేశాలతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉంది. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గల్ఫ్‌ దేశాలతో భారత్‌కు శతాబ్దాల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అనుబంధం ఉంది. భారత్‌ చమురు, గ్యాస్‌ దిగుమతుల్లో 60శాతం అక్కడి నుంచే వస్తున్నాయి. గల్ఫ్‌ దేశాలు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. భారత ఎగుమతుల్లో 14 శాతం వాటా వీటిదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌-యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నాయి. దీనిప్రకారం వచ్చే పదేళ్లలో 97శాతం భారతీయ ఉత్పత్తులపై, 90శాతం యూఏఈ ఉత్పత్తులపై పన్నులు ఉండవు. మే 1 నుంచి ఇది అమల్లోకి కూడా వచ్చింది. అలాగే 2020-21లో గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్- GCCతో భారత వాణిజ్యం సుమారు 6 లక్షల 75 వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ GCCలో కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ ఉన్నాయి..

Also read : GULF Contries serious on India :బీజేపీ నేతల వ్యాఖ్యలతో ప్రమాదంలో భారత ఆర్ధిక వ్యవస్థ..ఆంక్షల దిశగా 15 ముస్లిం దేశాలు

గల్ఫ్‌ దేశాల్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో భారత్ అత్యధిక వాణిజ్యం జరుపుతోంది. ఏడాదికి 72.9 బిలియన్ డాల్లర్ల బిజినెస్ చేస్తోంది. యూఏఈ మొత్తం వాణిజ్యంలో 7శాతం భారత్‌ నుంచే జరుగుతోంది. సౌదీ అరేబియాలో భారత్ 42.9 బిలియన్ డార్ల వ్యాపారం చేస్తుండగా.. ఆదేశ వాణిజ్యంలో భారత్ వాటా 4.1శాతంగా ఉంది. ఇక ఇరాక్ తో 34.3 బిలియన్లు, ఖతర్‌తో 15, కువైట్‌తో 12.2, ఒమన్‌తో 10, బహ్రయిన్‌తో 1.7బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని భారత్ చేస్తోంది.

ఒక్క వాణిజ్యంలోనే కాదు.. భారతీయులకు ఉపాధికల్పనలోనూ గల్ఫ్ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్‌ నుంచి విదేశాల్లో పని చేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో.. 8.7 మిలియన్ల మంది గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. అత్యధికంగా యూఏఈలో 34లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. సౌదీ అరేబీయాలో 26 లక్షలు, ఖతర్‌-7.4లక్షలు, కువైట్‌ -10లక్షలు, ఒమన్‌ – 7.8లక్షలు, బహ్రయిన్ -3.2లక్షల మంది కార్మికులుగా పనిచేస్తున్నారు.

వారంతా కోట్ల రూపాయలను రెమిటెన్స్‌గా మనదేశానికి పంపుతారు. ఈ రెమిటెన్సులు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. గతేడాది దేశ జీడీపీలో రెమిటెన్సుల శాతం 3.1గా ఉంది. రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత గల్ఫ్‌ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. అత్యధికంగా యూఏఈ నుంచి 27శాతం, సౌదీ అరేబియా నుంచి 11.6, ఖతర్ నుంచి 6.5, కువైట్ నుంచి 5.5, ఒమన్ నుంచి 3.3శాతం రెమిటెన్స్‌ల రూపంలో ప్రవాసభారతీయులు.. స్వదేశానికి పంపుతున్నారు. వీళ్లు పంపే సొమ్ముతో మనకు విదేశీ మారక ద్రవ్యం భారీగా సమకూరుతోంది. రెమిటెన్సుల్లో భారత్‌ ప్రపంచంలో నంబర్‌ వన్‌ కూడా. ఇప్పుడు వీటన్నిటపైనే భారత్‌కు టెన్షన్‌.. ఎవరో ఇద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చినికిచినికి గాలివానల మారుతుండడం.. ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.

Also read : Cordelia: విశాఖ చేరుకున్న విలాస నౌక ‘కార్డెలియా’.. సకల సౌకర్యాలతో అందుబాటులోకి

భారత్‌ గల్ఫ్‌ దేశాల మధ్య ఏటా 189 బిలియన్‌ డాలర్ల మేర వినియోగ వస్తువుల వ్యాపారం సాగుతుంది. భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టానికి గల్ఫ్ కంట్రీస్ ఎంతో ఊతమిస్తున్నాయి. అలాంటిది గల్ఫ్ కంట్రీస్ భారత విషయంలో ఆంక్షలు విధిస్తే.. ఆర్ధిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే జరిగితే భారత ఆర్ధికవ్యవస్థ గాడితప్పే ప్రమాదం లేకపోలేదు. పైగా.. ఇప్పటి వివాదాన్ని సాకుగా చేసుకుని అక్కడ భారతీయులపై వేధింపులు పెరుగుతాయేమో అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఇదే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

గల్ఫ్ సహా ముస్లిం దేశాలకు సర్దిచెప్పడం కేంద్రానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా.. రాజకీయ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడం కాదు.. ఓ మాట అనే ముందు అది దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆలోచించుకోవాలి. అలాంటి నేతలను రాజకీయపార్టీలు ఉపేక్షించకూడదు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే రాజకీయ పార్టీలు కానీ.. దేశం కానీ సురక్షితంగా ఉంటుంది. ఒకరి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. నుపూర్‌ శర్మ భారత దేశానికి అధికార ప్రతినిధి ఏమాత్రం కాదు.. కానీ.. ఆమె రగిలించిన మంటకు.. సెగ గల్ఫ్‌ కంట్రీస్‌ నుంచి వస్తోంది. గల్ఫ్ కంట్రీస్ విమర్శలకు భారత ప్రభుత్వం దీటుగానే స్పందించినా.. దాని ప్రభావం మన వాణిజ్యంపై, కార్మికులపై పడకుండా చూడడమే ఇప్పుడు కేంద్రం ముందున్న అసలు సిసలు సవాల్.