cervical cancer: కరోనా తరువాత మహిళల్లో సర్వికల్ కాన్సర్..

కరోనా తరువాత ఎక్కువమంది మహిళలు సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గైనకాలజిస్టుల వద్దకు వస్తున్న మహిళల్లో సర్వికల్ కేసుల నిర్ధారణ కావటం ఆందోళన కలిగిస్తోంది.

cervical cancer: కరోనా తరువాత మహిళల్లో సర్వికల్ కాన్సర్..

Cervical Cancer

cervical cancer : కరోనా వైరస్ ఏ క్షణంలో పుట్టిందో గానీ ప్రపంచ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఏ ప్రభావం అయినా ముందుగా మహిళలపైనే పడతుంది అనేది నిజం. అలాగే కరోనా కూడా అలాగే ఉంది. కరోనాకు ముందు కరోనాకు తరువాత అన్నట్లుగా తయారైంది మనుషులు ఆరోగ్య పరిస్థితి. ముఖ్యంగా మహిళలు కరోనా వచ్చిన తరువాత సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లుగా తెలుస్తోంది.కరోనా తరువాత మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ కావటమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో క్యాన్సర్ కేసులు ఎక్కువ నమోదవుతూన్నాయనే అనుమానాన్ని కొంతమంది నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది మహిళలు సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గైనకాలజిస్టుల వద్దకు వస్తున్న మహిళల్లో సర్వికల్ కేసుల నిర్ధారణ కావటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఓ సీనియర్ గైనకాలజిస్టు మాట్లాడుతూ..కరోనా కు ముందు నెలకు మహా అయితె రెండు మూడు కాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యేవని..కానీ ఇప్పుడు నెలకు ఐదారు కేసులు వస్తున్నాయని తెలిపారు.

సదరు డాక్టర్ వద్దకు 36 ఏళ్ల మహిళ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తోంది అంటూ వచ్చింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అనుమానం వ్యక్తం చేసిన సదరు గైనకాలజిస్ట్ వఆమెకు బయాప్సి చేయించగా డాక్టర్ అనుమానమే నిజమైంది. బాధితురాలు సర్వికల్ కాన్సర్ స్టేజ్ 2 లో ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దీనిపై బాధితురాలిని డాక్టర్ కొన్ని ప్రశ్నలు వేస్తూ..‘ఇప్పటి వరకూ ఎందుకు డాక్టర్ ని కన్సల్ట్ చేయలేదని..ఎందుకు లేట్ చేశావని అడుగగా..ఆమెగతంలో నాకు ఇటువంటిసమస్య రాలేదనీ..కానీ మా ఇంట్లో అందరూ కరోనా బారిన పడ్డారు.. ఇప్పుడిప్పుడే అందరు కోలుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు వచ్చానని తెలిపింది.

ఆమె సమస్య అర్థం చేసుకున్న డాక్టర్ కొన్ని సూచనలు చేసి మెడిసిన్స్ రాసిచ్చారు. కానీ ముందే డాక్టర్ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ వద్దకు ఆమె వెళ్ళివుంటే..సర్వికల్ క్యాన్సర్ తొలిదశలోనే కనుకుని ఆపరేషన్ తో తగ్గించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అయ్యేది.. కానీ ఇప్పుడు రేడియో, కేమో చేయాల్సిన స్టేజ్ కు చేరుకుంది.ఒక మరో మహిళ కేసు విషయంలో ఆమెకు 65 ఏళ్ళు..రుతుక్రమం కూడా ఆగిపోయింది (మెనోపాజ్) కూడా. ఈక్రమంలో ఆమెకు కరోనా సోకింది. దాన్నుంచి కోలుకున్న సంవత్సరానికి బ్లీడింగ్ అప్పుడప్పుడు కొద్దిగా కనిపిస్తోంది..నీరసం వల్లనేమో అనుకుని డాక్టర్ వద్దకు వెళ్లలేదు. ఆ తరువాత పదే పదే నీరసంతో కళ్లు తిరుగుతున్న పరిస్థితిలో డాక్టర్ వద్దకు వెళ్లగా అదే అనుమానంతో బయాస్పీ చేయగా సర్వికల్ క్యాన్సర్ గా నిర్ధారణ అయ్యింది. కానీ అప్పటికే సర్వికల్ క్యాన్సర్ ముదిరిపోయింది. ఆపరేషన్ స్టేజ్ కూడా దాటిపోయింది. ఇలు పలు కేసులు డాక్టర్ వద్దకు వెళ్లక ముందే గుర్తించక ప్రమాదంలో పడిన పరిస్థితి.

ఈ క్రమంలో పలువురు గైనకాలజిస్టులు సర్వికల్ కాన్సర్ పై మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. పీరియడ్స్ విషయం తేడాలు వచ్చినా..మెనోపాజ్ తరువాత బ్లీడింగ్ అయినా ఇలా పలు ఆరోగ్య విషయాల్లో ఎటువంటి తేడాలు వచ్చినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని సూచిస్తున్నారు. తమకు సర్వికల్ కాన్సర్ సోకిందని తెలియని ఎంతమంది మహిళలున్నారో.. అంటూ గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ దీన్ని ముందుగా గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అని సూచిస్తున్నారు.