Moon : ఉద్యోగికి చంద్రుడిపై స్థలం గిఫ్ట్

కంపెనీలో ఎంతో హార్డ్ వర్క్ గా పనిచేసిన ఉద్యోగికి గుర్తుండే గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Moon : ఉద్యోగికి చంద్రుడిపై స్థలం గిఫ్ట్

Moon Land

Acre of Land : కంపెనీలో ఎంతో హార్డ్ వర్క్ గా పనిచేసిన ఉద్యోగికి గుర్తుండే గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రుడిపై ఒక ఎకరం భూమికి అతను యజమాని అయ్యాడు. అతని చేసిన కృషికి చాంద్ కా తుక్ డా వచ్చిందంటున్నారు. జాగ్రన్ నివేదిక ప్రకారం..బీహార్ రాష్ట్రంలోని దర్బంగా ప్రాంతానికి చెందిన Rahmani నోయిడాలోని AR Studios సాఫ్ట్ వేర్ కంపెనీని నడుపుతున్నాడు. ప్రత్యేకంగా Artificial Intelligence గా పనిచేస్తుంది.

చంద్రుడిపై భూములు విక్రయించే లైనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ కోసం Iftekhar సహాయం చేస్తుంటాడు. ఇతని విశేష కృషికి ఫలితాన్ని గుర్తించిన కంపెనీ..చంద్రుడిపై ఒక ఎకరం భూమిని గిఫ్ట్ గా ఇచ్చింది.
జిల్లాలో చంద్రుడిపై భూమి వచ్చిన మొదటి వ్యక్తి కావడంతో అతని కుటుంబం, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేశారు. తన కొడుకు విజయంతో చాలా సంతోషంగా ఉన్నట్లు Iftekhar తల్లి వెల్లడించారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్, షారూఖ్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖలు చంద్రుడిపై భూమిని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేర్చబడిన అదృష్టవంతుల్లో Iftekhar ఒకరు.