IMPS : పండుగ వేళ, ఆర్బీఐ శుభవార్త..రూ. 5లక్షల వరకు ట్రాన్స్ ఫర్

పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. IMPS లావాదేవీల పరిమితిని పెంచింది.

IMPS : పండుగ వేళ, ఆర్బీఐ శుభవార్త..రూ. 5లక్షల వరకు ట్రాన్స్ ఫర్

Rbi

IMPS Limit : పండుగ వేళ ఆర్బీఐ శుభవార్త వినిపించింది. ఆన్ లైన్ చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ (IMPS, ఇమ్మిడియేట్ పేమెంట్ స‌ర్వీస్) లావాదేవీల పరిమితిని పెంచింది. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. తాజాగా..దీనిని రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సాహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
2021, అక్టోబర్ 08వ తేదీ…శుక్రవారం…ఆర్బీఐ ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి క‌మిటీ సమావేశం జరిగింది.

Read More : Supreme Court: అక్రమాస్తుల కేసులో ఏపీ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఐఎంపీఎస్‌ లావాదేవీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల‌కు పెంచిన‌ట్లు వెల్ల‌డించారు. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐఎంపీఎస్ బ్యాంకుల లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు క్షణాల్లో డబ్బులు పంపించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు. 2010లో తొలిసారిగా దీనిని ప్రారంభించారు. 24 గంటల పాటు ఈ సేవలు పని చేస్తాయి. 2014 జనవరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ పరిమితిని పెంచారు.