Imran Khan : శాంతి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం..కానీ RSS సిద్ధాంతం అడ్డొచ్చింది

భారత్​తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​.

Imran Khan : శాంతి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం..కానీ RSS సిద్ధాంతం అడ్డొచ్చింది

Imran

Imran Khan భారత్​తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. ఆప్గనిస్తాన్ లో ప్రస్తుత ఘర్షణలకు కారణమైన తాలిబన్ల విషయంపై స్పందించేందుకు నిరాకరించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)సిద్ధాంతపై విమర్శలు గుప్పించారు. రెండు రోజుల ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్నపాక్ ప్రధాని..శుక్రవారం తాష్కెంట్ లో జరుగుతున్న సెంట్రల్​- సౌత్​ ఆసియా కాన్ఫరెన్స్ ​కు హాజరైన సందర్భంగా ఆయనను ఏఎన్​ఐ రిపోర్టర్ పలు ప్రశ్నలు అడిగారు.

విలేఖరి ప్రశ్న : ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా శాంతి చర్చలు సాధ్యమా? భారత్​ తరఫున మీకు ఇది సూటి ప్రశ్న

ఇమ్రాన్ ఖాన్: శాంతి స్థాపన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నామని భారత్​కు చెప్పాలనుకుంటున్నాం. కానీ మధ్యలో ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతం అడ్డు వచ్చింది. ఇక చేసేదేం ఉంది
విలేఖరి : తాలిబన్లను పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుందని వస్తున్న ఆరోపణలపై మీరు ఏమంటారు?

అయితే తాలిబన్లపై ప్రశ్నించగానే.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇమ్రాన్ ఖాన్​. పలుమార్లు సమాధానం చెప్పాలని కోరినప్పటికీ స్పందించలేదు.