Mask లేనందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి Fine

  • Published By: madhu ,Published On : September 30, 2020 / 11:17 AM IST
Mask లేనందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి Fine

wearing masks : మాస్క్ ధరించకుండా బయటకు వచ్చినందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి జరిమాన విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కంపల్సరి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సైక్లింగ్ ఈవెంట్ లో Ahmedabad Municipal Corporation Deputy Municipal Commissioner Nitin Sangwan మాస్క్ ధరించకుండా పాల్గొన్నందుకు రూ. 1000 జరిమాన విధించారు.



దీనిపై ఆయన స్పందించారు. ప్రొగ్రాంలో తాను మాస్క్ తీసివేయడం తప్పు అని, దీనిపై AMC వెంటనే చర్యలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ లలో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు. ఇటీవలే నగరంలోని 27 ప్రసిద్ధ మార్కెట్ ప్రదేశాల్లో రాత్రి 10 నుంచి రెస్టారెంట్లు, ఇతర ఫుడ్స్ షాప్స్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.



జూన్ 15 నుంచి సెప్టెంబర్ 27 వరకు మాస్క్ లు ధరించనందుకు 17 లక్షల 39 వేల 809 మందికి ఫైన్ వేశామని, దీని ద్వారా 53.70 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఇందులో అహ్మదాబాద్ ప్రథమస్థానంలో కొనసాగుతుండగా, సూరత్, రాజ్ కోట్, వడోదర తర్వాత స్థానాల్లో నిలిచాయన్నారు.



మాస్క్ ధరించేలా చూడడం, నిబంధనలు పాటించని వారి వద్ద నుంచి జరిమాన వసూలు చేయాలని గుజరాత్ పోలీసులకు ఆరోగ్య శాఖ జూన్ 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన తెప్పించడం డ్రైవ్ ల వెనుక ముఖ్య ఉద్దేశ్యమని Narsimha Komar (IG, Law and Order) చెప్పారు. తమ లక్ష్యం జరిమాన వసూలు చేయడం కాదని, మార్గదర్శకాలను పాటించాలని చెప్పడమేనన్నారు. పేద ప్రజలకు ఉచితంగానే మాస్క్ లు పంపిణీ చేశామన్నారు. అహ్మదాబాద్ లో సోమవారం 1, 837 మందికి జరిమాన విధించామన్నారు.