gold smuggling case : ఈడీ అధికారులపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఏకంగా కొందరు ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్(ED)​ అధికారులపైనే కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించారన్న ఆరోపణలపై ఈమేరకు చర్యలు చేపట్టింది.

gold smuggling case : ఈడీ అధికారులపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు

Gold Smuggling

gold smuggling గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఏకంగా కొందరు ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్(ED)​ అధికారులపైనే కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించారన్న ఆరోపణలపై ఈమేరకు చర్యలు చేపట్టింది. ఎర్నాకుళంలోని జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో క్రైమ్‌ బ్రాంచ్‌ ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్‌ను ఇరికించేందుకు గత ఏడాది ఆగస్ట్‌ 12, 13 తేదీల్లో స్వప్నా సురేష్‌ను ప్రశ్నించే సందర్భంలో సీఎంకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆమెపై ఈడీ అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. లీక్​ అయిన స్వప్న ఆడియోటేప్​ అధారంగా ఈ ఫిర్యాదు నమోదు చేశారు. కొచ్చిలో ఈడీ కార్యాలయంలో తనను అధికారులు ప్రశ్నిస్తూ విజయన్‌ సహా కొందరు మంత్రులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని బెదిరించారని అప్పట్లో స్వప్నా సురేష్‌ ఆరోపించిన వాయిస్‌ క్లిప్పులు బయటికొచ్చాయి.

ఈడీ అధికారులపై పోలీస్‌ కేసు విషయంపై సీఎం పినరయి విజయన్‌ స్పందిస్తూ వారు చట్టానికి వ్యతిరేకంగా నిర్ధిష్ట చర్యలు చేపడితే చట్టబద్ధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే స్పృహ వారు కలిగిఉండాలని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం,బీజేపీ వాడుకుంటున్నాయని సీఎం విజయన్ ఇదివరకే పలుమార్లు విమర్శించారు. మరోవైపు, కేరళ క్రైం బ్రాంచ్​ కేసు నమోదు చేయడం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి.