పండుగ స్పెషల్.. రూ.200కోట్లు దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్లు

పండుగ స్పెషల్.. రూ.200కోట్లు దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్లు

యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత పేమెంట్లు తొలిసారిగా అక్టోబరులో రూ.200కోట్ల మార్క్ దాటింది. కరోనా పరిస్థితులు మొదలైన తర్వాత తొలిసారి పండుగ సీజన్లో నమోదైన భారీ ట్రాన్సాక్షన్లు ఇవే. తొలి 15రోజుల్లోనే 100కోట్ల మార్కును దాటేశాయి.

ఈ 100కోట్ల ట్రాన్సాక్షన్ల విలువ రూ.3.86లక్ష కోట్లు. దీనిని బట్టి చూస్తే సెప్టెంబర్ లావాదేవీల కంటే 15శాతం మెరుగు కనిపించగా, ఆగష్టు కంటే సెప్టెంబరులో 12శాతం బెటర్ పరిస్థితి కనిపించింది.



‘కొన్నేళ్ల నుంచి జరుగుతున్న ట్రాన్సాక్షన్లతో BHIM UPI మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి బిజినెస్ పర్సన్‌కు అలవాటైన లావాదేవీలుగా మారాయి. కొన్నేళ్లుగా వారికి భద్రంగా సెక్యూర్‌గా మార్చాయి’ అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అని ట్వీట్ లో వెల్లడించింది.
https://10tv.in/gst-collection-crosses-rs-1-lakh-crore-mark-for-first-time-since-february/
గతేడాది అక్టోబరులో యూపీఐ నుంచి జరిగిన పేమెంట్స్ 100కోట్ల మార్క్ దాటగా వాటి విలువ రూ.114.83కోట్లు. ఎకానమీ తిరిగి పుంజుకునేందుకు ఆన్‌లైన్ షాపింగ్ బాగా ఉపయోగపడింది. ఫెస్టివల్ సేల్స్ అంటూ ఇచ్చిన ఆఫర్లకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపించడమే దీనికి కారణం.



2008లో అంబ్రిల్లా ఆర్గనైజేషన్ ఇండియాలో ఈ రిటైల్ పేమెంట్స్, సెటిల్‌మెంట్ సిస్టమ్స్‌ను మొదలుపెట్టింది. 2016లో డిజిటల్ బేస్డ్ పేమెంట్ ప్లాట్ ఫాంను లాంచ్ చేశారు. ఇది స్టార్ట్ చేసిన 4నెలల తర్వాతనే డీ మానిటైజేషన్ జరిగింది.

అప్పటి నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్ కు అలవాటు పడటంతో 100కోట్ల ట్రాన్సాక్షన్లు పూర్తవడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఆ తర్వాత 100కోట్ల ట్రాన్సాక్షన్లు జరగడానికి సంవత్సరం కూడా సమయం తీసుకోలేదు. ప్రస్తుతం యూపీఐ ఛానెల్‌లో 189 బ్యాంకులు ఉన్నాయి.