India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం

ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్ధిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు పడిందని ఇరువురు ప్రధానులు పేర్కొన్నారు

India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం

Modi

India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య మైలురాయి ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం భారత్ నుంచి వెళ్లే 96.8 శాతం ఉత్పత్తులకు సుంకం మినహాయింపు (Duty Free) వేల మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, ఆస్ట్రేలియాలోని భారతీయ ఉద్యోగులు మరియు విద్యార్థులకు వీసా వ్యవస్థను సులభతరం కానుంది. ఈమేరకు శనివారం జరిగిన వర్చువల్ సమవేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ..ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్ధిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు పడిందని ఇరువురు ప్రధానులు పేర్కొన్నారు.

Also read:Hyderabad : హైదరాబాద్ లో ఐసిస్ కలకలం…సానుభూతి పరుడు అరెస్ట్

“ఇండియా ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం”గా పేర్కొన్న ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఆస్ట్రేలియాకు సులభతర ప్రవేశం మరియు నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యారంగ పరమైన ఎగుమతులను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఒప్పందంపై సంతకం చేయగా..ఈ ఒప్పందం వల్ల పది లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. సేవల రంగ ఒప్పందం కింద భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే చెఫ్స్, యోగా శిక్షకులకు 1800 వార్షిక కోట ఇచ్చింది. దీంతో వీరు ఆస్ట్రేలియాలో తాత్కాలికంగా నాలుగేళ్ళ పాటు సేవలు అందించవచ్చు. అదే విధంగా సుమారు లక్ష మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ వీసా పొందడంతో పాటు, ఒప్పందంలోని నిబంధనల ప్రకారం మరో నాలుగు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.

Also read:Bihar BJP MLA: పోలీస్ కుర్చీలో కూర్చుని స్టేషన్లో కేసుల వివరాలు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

ఆస్ట్రేలియలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ను పెంపొందించే లక్ష్యంతో భారతదేశంలోని ఐటి నిపుణులను ఆకర్శించే విధంగా ప్రతిభ ఆధారిత నిపుణులకు ప్రత్యేక ఆహ్వానంతో పాటు భారతీయ ఐటి కంపెనీలు ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టె విధంగా ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతో పాటుగా వర్క్ హాలిడే నిమిత్తం భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే 18-30 ఏళ్ల వయసున్న 1000 మందికి ఒక ఏడాది పాటు “మల్టీ ఎంట్రీ” వీసాను అందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఈ వీసా పొందిన వారు ఏడాది సమయంలో నాలుగు నెలల పాటు ఏదైనా వృత్తి శిక్షణ పొంది ఆపై రెగ్యులర్ ఉద్యోగ నిమిత్తం వీసాను కూడా పొందవచ్చు.

Also read:India – Turkmenistan: భారత్ వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని పునరుద్దరించనున్న తుర్క్‌మెనిస్తాన్