China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా

అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. "భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది.

China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా

Gt

China Media: సరిహద్దు వివాదంలో భారత్ – చైనా మధ్య తలెత్తిన వివాదం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీసింది. అంతర్జాతీయ తీర్మానాల్లోనూ భారత్ కు వ్యతిరేకంగా చైనా తమ వాణి వినిపించింది. దింతో రెండు దేశాల మధ్య కొద్ది పాటి ఎడం పెరిగింది. ఈక్రమంలో ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరుపై చైనా జాతీయ మీడియా సానుకూలంగా స్పందించింది. వివరాల్లోకి వెళితే ఇటీవల భారత్ నుంచి గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఆహార భద్రత మరియు ధరల నియంత్రణ దృష్ట్యం భారత ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేదించింది. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు పెదవి విరిచారు. ప్రపంచం మొత్తం సంక్షోభంలో చిక్కుకున్న ఇటువంటి పరిస్థితుల్లో భారత్, ఆహార ధాన్యాల ఎగుమతిని నిషేధించడం సమంజసం కాదని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి వ్యాఖ్యానించారు.

Other Stories: PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ

భారత్ తిరిగి గోధుమల ఎగుమతి ప్రారంభించాలని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార భద్రతకు భారత్ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని జీ-7 దేశాల ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇక విషయంపై స్పందించిన చైనా జాతీయ మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చాయి. అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. “భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. G7 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు గోధుమ ఎగుమతులను నిషేధించవద్దని ఇప్పుడు భారతదేశాన్ని కోరుతున్నారు, అయితే G7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ప్రపంచ ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు?” అని చైనా ప్రభుత్వ అధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక ఆదివారం కధనం ప్రచురించింది.

Other Stories: Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్

“ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అయినప్పటికీ, ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో చిన్న భాగాన్ని మాత్రమే భారత్ కలిగి ఉంది. దీనికి విరుద్ధంగా, అమెరికా, కెనడా, యూరోప్ మరియు ఆస్ట్రేలియాతో సహా కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు గోధుమలను ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో ముందున్నాయి” అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది. ప్రపంచంలో పెరిగిపోతున్న ఆహార సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా దేశాలు తమ ఎగుమతులను నియంత్రించుకుంటే..వారు భారత్ ను విమర్శించే స్థాయిలో లేరని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ ఆహార భద్రత దృష్ట్యా గోధుమల ఎగుమతులపై జీ-7 దేశాల ఆందోళన వాస్తవమే అయినప్పటికీ అందుకు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను నిందించడం మానుకోవాలని గ్లోబల్ టైమ్స్ తన కధనంలో వెల్లడించింది.