ED, CBI, Inflation Effigy Burnt : ద‌స‌రా వేడుకల్లో రావ‌ణుడికి బ‌దులు ఈడీ, సీబీఐ, ద్ర‌వ్యోల్బ‌ణం దిష్టిబొమ్మ‌ల దగ్ధం

చెడు మీద మంచి సాధించిన విజ‌యానికి సంకేతంగా  రావ‌ణుడి దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం చేస్తూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ద‌స‌రా వేడుకల‌ను జ‌రుపుకుంటే గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్ర‌వ్యోల్బ‌ణం దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా భుజ్‌లోని హ‌మిర్స‌ర్ చెరువు దగ్గర కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న‌ చేప‌ట్టాయి.

ED, CBI, Inflation Effigy Burnt : ద‌స‌రా వేడుకల్లో రావ‌ణుడికి బ‌దులు ఈడీ, సీబీఐ, ద్ర‌వ్యోల్బ‌ణం దిష్టిబొమ్మ‌ల దగ్ధం

ED, CBI, Inflation Effigy Burnt : చెడు మీద మంచి సాధించిన విజ‌యానికి సంకేతంగా  రావ‌ణుడి దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం చేస్తూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ద‌స‌రా వేడుకల‌ను జ‌రుపుకుంటే గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్ర‌వ్యోల్బ‌ణం దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా భుజ్‌లోని హ‌మిర్స‌ర్ చెరువు దగ్గర కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న‌ చేప‌ట్టాయి. అందులో భాగంగా రావ‌ణుడికి బ‌దులు ఈడీ, సీబీఐ, ద్ర‌వ్యోల్బ‌ణం దిష్టిబొమ్మ‌ల‌ను ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ద‌గ్ధం చేశారు.

Prabhas : రావణ దహనం చేసిన ప్రభాస్.. ప్రభాస్‌నే ఎందుకు పిలిచారో చెప్పిన రాంలీలా కమిటీ..

కాషాయ పార్టీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. త్వ‌ర‌లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగనుండ‌గా ధ‌ర‌ల పెరుగుద‌ల‌, వైద్యారోగ్య మౌలిక వ‌స‌తుల లేమి, జీఎస్టీ పెరుగుద‌ల వంటి స‌మ‌స్య‌ల‌పై కాషాయ ప్రభుత్వమే ల‌క్ష్యంగా కాంగ్రెస్ విమ‌ర్శ‌లు చేస్తోంది. బీజేపీ ప్ర‌భుత్వం కేంద్ర దర్యాప్తు సంస్ధ‌ల‌ను ప్ర‌యోగించి విప‌క్షాల గొంతు నొక్కుతోంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.